సీసీబీఐ లో నూతన నియామకం

నూతన నియామకంగురుశ్రీ గాలి అరుళ్ రాజ్

సీసీబీఐ ఫామిలీ కమిషన్ కు నూతన ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గా గురుశ్రీ గాలి అరుళ్ రాజ్ గారు నియమింపబడ్డారు. 21 సెప్టెంబర్ 2022 న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని 7 అక్టోబర్ 2022 న ఒక అధికార ప్రకటనలో సీసీబీఐ వెల్లడించింది.

గురుశ్రీ అరుళ్ రాజ్ గారు తమిళనాడు లోని కాంచీపురం జిల్లా, మనంబతి  కాండిగై అనే గ్రామం లో 4 నవంబర్ 1953 లో జన్మించారు. సెయింట్ జోసఫ్స్ హై స్కూల్, తిరుచ్చి  లో ప్రాధమిక విద్యను పూర్తి చేసుకున్న ఆయన, సెయింట్ జోసఫ్స్ కళాశాల , బెంగళూరు లో తన ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నారు. హోలీ క్రాస్ గురువుల సభలో చేరిన ఆయన 5 మే 1981 న గురువుగా అభిషేకించబడ్డారు. 

కొట్టాయంలో  మరియు తిరుచ్చి లోని సెమినరీలకు రెక్టర్ గా ఆయన పని చేసారు. ఆయన నూతన నియామకానికి అభినందనలు తెలుపుతూ ఆయనకు ఆ దేవాదిదేవుడు తోడుగా ఉండాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు వారు కోరుకుంటున్నారు.

Add new comment

13 + 0 =