Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
సిస్టర్ విర్గులా మరియా ష్మిత్ గారు ప్రభువునందు నిద్రించారు.
ఇండోనేషియాలోని మానవతా సంస్థలో కార్యకర్తగా పనిచేస్తున్న93 సంవత్సరాల వయస్సుగల సిస్టర్ విర్గులా మరియా ష్మిత్ గారు జూన్ 27,2022న నెదర్లాండ్స్‌లో ప్రభువునందు నిద్రించారు. జర్మనీలోని గ్రునెబాచ్‌లో 1929లో జన్మించిన విర్గులా గారు 1963లో కాంగ్రిగేషన్‌లో చేరారు. పేదలు మరియు రోగులకు సహాయం చేయడానికి మిషనరీగా 1965లో ఇండోనేషియాకి వచ్చారు. "వివిధ రుగ్మతలతో బంధించబడిన వారిని విడిపించడానికి నేను పిలువబడుతున్నాను ఎందుకంటే వారు దేవుని పిల్లలు." అనేది ఆమె నినాదం.
సెయింట్ డామియన్ సెంటర్ యొక్క 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని Floresku.com వార్తా సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ప్రమోట్ చేస్తూ జనవరి 16, 2011న ఒక ఇంటర్వ్యూలో, సెయింట్ డామియన్ లెప్రసీ పునరావాస కేంద్రాలు ఎలా ఉనికిలోకి వచ్చాయో సిస్టర్ విర్గులా హృదయపూర్వకంగా మాట్లాడారు.
1966లో, ఒక కుష్ఠురోగి ఉన్నాడని, అతని కుటుంబం అతన్ని అరణ్యంలో విడిచిపెట్టిందని ఒక ఫ్రాన్సిస్కన్ గురువు అతన్ని కనిపెట్టి, ఆమె పనిచేసిన సెయింట్ రాఫెల్ పాలిక్లినిక్‌కి తీసుకువచ్చారు. నేను రోగికి అత్యుత్తమ సంరక్షణను అందించాను, ”అని ఆమె వివరించారు. 1966లో, జర్మనీలోని స్నేహితుల సహాయంతో సెయింట్ రాఫెల్ పాలిక్లినిక్ నుండి లెప్రసీ కేర్ సెంటర్ వేరు చేయబడింది ,అప్పటి నుండి, ఇది ఒక పెద్ద పునరావాస కేంద్రంగా అభివృద్ధి చెందింది. తన అభివృద్ధికి దేవుడే కారణమని ఆమె బలంగా నమ్మింది. నేను దేవుని చిత్తానికి కట్టుబడి ఉంటాను.ప్రభూ, ఈ రోజు నేను ఏమి చేయాలనుకుంటున్నావో నాకు చూపించి, నాకు సామర్థ్యాన్ని ఇవ్వండి. అది చేయటానికి'.""దేవుడు ఏదైనా కోరుకుంటే, మనం దానిని ఎదిరించలేము. దేవుడు నాతో ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నేను ఆందోళన, భయాన్ని అనుభవించలేను"అని ఆమె తెలియజేశారు.
మిషనరీ సిస్టర్స్ సర్వెంట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ సభ ప్రొవిన్సియల్ సిస్టర్ యోహానా M.మోమాస్ గారు RVA న్యూస్‌తో మాట్లాడుతూ, సిస్టర్ విర్గులా గారు మానవతా సేవలో మొదటి వ్యక్తి, ముఖ్యంగా వికలాంగులకు మరియు కుష్టు వ్యాధి, అలాగే లైంగిక హింస బాధితులకు ఒక మంచి మార్గదర్శకురాలు. విర్గులా గారు అందరితో ఇష్టపూర్వకంగా సహకరించారని మరియు అనారోగ్యంతో ఉన్న పేదలను చూసుకునే తన మార్గాన్ని కొనసాగించడానికి ఇతర సోదరీమణులను ప్రేరేపించారని సాక్ష్యమిచ్చారు. ఆమె మిషనరీ బాధ్యతను 'పాసింగ్ ఓవర్' చేసే ఆధ్యాత్మికతను కలిగి ఉన్న వ్యక్తి అని, ఇతర సోదరీమణులకు మిషన్‌ను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని పేర్కొనివారని ప్రొవిన్సియల్ సిస్టర్ తెలిపారు.
దేవుడు సమయానుకూలంగా సహాయాన్ని అందిస్తాడని సిస్టర్ విర్గులా గారు ఎప్పుడూ నమ్ముతూ ఉండేవారు.
Add new comment