సిస్టర్స్ పై దాడి

ఇదే నెలలో మనమందరం మహిళా దినోత్సవం సందర్భముగా వాట్స యాప్  ఇతర సోషల్ మీడియా లలో మహిళలకు మద్దతుగా పోస్టులు పెట్టాము...

 కుటుంబానికి  దూరం గా, సేవ చేయాలనే తపన తో దేశాలు ధాటి వచ్చి మన మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపి, తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి వారిగా అమ్మగా మారిన మదర్ థెరిసా కు మనం ఎప్పటికి రుణపడి ఉన్నాము.

అదే క్రిస్టియన్  సన్యాసినులు(Sisters) ఇద్దరు మరియు సన్యాసినులు తయారు అవుతున్న మరో ఇద్దరు  ఢిల్లీ  నుండి ఒడిశాకు ప్రయాణిస్తున్నారు, వారి 3 వ ఎసి కంపార్ట్మెంట్లో ఉన్న  బజరంగ్ దళ్ సభ్యులు సిస్టర్స్ కోసం ఇతర  బజరంగ్ దళ్ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆ రాత్రి సమయం లో మహిళలు అని చూడకుండా  భయభ్రంతులకు గురి చేసారు. ఆధార్ మరియు వారు క్రైస్తవులు అని ఇతర రుజువులను చూపించాలని దౌర్జన్యం చేసారు . జైశ్రీరామ్ నినాదాలు చేసి ప్రయాణికులను వేధించారు, రైలు ఝాన్సీ  స్టేషన్కు చేరుకున్నప్పుడు, రైల్వే పోలీసులు వారిని రైలు నుండి బలవంతంగా కిందకు దింపేశారు.  ముందుగా సమాచారం అందుకున్న  బజరంగ్దాల్ సభ్యులు అధిక సంఖ్యలో గుమిగూడారు. మతపరమైన నినాదాలు చేస్తూ,  సన్యాసినులు(Sisters)  పోలీస్ స్టేషన్‌కు తరలించేలా చేసారు.

సిస్టర్స్  లేకుండా రైలు స్టేషన్ నుండి బయలుదేరిందని తెలిసి అక్కడ క్రైస్తవలు  బిషప్ ను  సంప్రదించారు . గురువులు  మరియు ఉన్నతాధికారులతో పాటు అక్కడికి చేరుకున్నారు మరియు ధృవీకరణ తర్వాత వారు నిర్దోషులు అని పోలీసులు అధికారులు నిర్ధారించారు.
దయచేసి భారతదేశం కోసం ప్రార్థించండి.

Add new comment

11 + 4 =