సినడ్ సమావేశం- కడప మేత్రాసనం

కడప మేత్రాసనం, మైదుకూరు విచారణ సెయింట్ జోసఫ్ దేవాలయము నందు విచారణ స్థాయిలో సినడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉదయం 8 గంటలకు ప్రొదుట్టూరు విచారణ కర్తలు మరియు డీన్ గురుశ్రీ కే విజయ్ బాబు దివ్యపూజబలిని సమర్పించారు.

సినడ్ కార్యక్రమంలో విచారణ విశ్వాసులు, యువతీ యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉదయం 10:30 కి సినడ్ కార్యక్రమాన్ని విచారణ కర్తలు గురుశ్రీ గొడుగునూరు ఆండ్రూ ప్రభాకర్ గారు పవిత్రాత్మ గీతంతో ప్రారంభించారు. డీన్ ఫాదర్ గారు విచారణ సినడ్ సభకు పిలుపునిచ్చారు.

అమృతవాణి డైరెక్టర్ మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం కోఆర్డినేటర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు

1 సినడ్ అనగా ఏమి ? దాని చరిత్ర ?

2 సినడ్ యొక్క ఉద్దేశము ఏమిటి?

3 సినడ్ మననుండి ఎం ఆశిస్తుంది? అను మూడు అంశాలను గురించి ప్రజలకు వివరించారు.

మధ్యాహ్నం 12:15 కి విచారణ విశ్వాసులు, మఠకన్యలు విచారణ యువతీయువకులను రెండు గ్రూపులుగా విభజించి సినడ్ గురించి వారి అమూల్యమైన అభిప్రాయాలను కోరారు.

మొదటి గ్రూప్ మోడరేటర్ గా గురుశ్రీ ఎస్ చైతన్య గారు (సహాయక గురువు - కరుణగిరి పుణ్యక్షేత్రం) మరియు రెండవ గ్రూప్ మోడరేటర్ గా గురుశ్రీ మూరతోటి అనీల్ కుమార్ గారు (సహాయక గురువు - మైదుకూరు విచారణ) బృంద చర్చలను ముందుకు నడిపారు.

 ఒంటి గంటకు బృందాలనుండి సెక్రటరీలు శ్రీ రామకృష్ణ గారు మరియు శ్రీ పి ప్రభాకర్ గారు అభిప్రాయాలను సేకరించి నివేదికను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 86 మంది విచారణ విశ్వాసులు పాల్గొన్నారు.

Add new comment

1 + 5 =