"సిట్టడెల్లా సిలో" లో పోప్ ఫ్రాన్సిస్

మంగళవారం, పోప్ ఫ్రాన్సిస్ “సిట్టడెల్లా సిలో” ను సందర్శించారు, ఈ సదుపాయాన్ని “నువోవి ఒరిజోంటి” సంఘం సభ్యులు ఏర్పాటుచేశారు

చియారా అమిరాంటే స్థాపించిన “నువోవి ఒరిజోంటి” సంఘం యొక్క “సిట్టడెల్లా సిలో” (హెవెన్లీ సిటాడెల్) ను పోప్ ఫ్రాన్సిస్ సందర్శించారు . ఆయనతో పాటు కొత్త సువార్త ప్రచారం కోసం పోంటిఫికల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ రినో ఫిసిచెల్లా ఉన్నారు.

ఉదయం 9:40 గంటలకు పోప్ వచ్చినప్పుడు, అక్కడ ఉన్నవారు అతన్ని సౌకర్యం యొక్క ఆడిటోరియంలో స్వాగతించారు. చియారా అమిరాంటే క్లుప్తంగా మాట్లాడారు, ఆ తరువాత ఒక యువకుడు మరియు ఒక యువతి వారి సాక్ష్యాలను ఇచ్చారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఒపెరా సింగర్ ఆండ్రియా బోసెల్లి కూడా తన కొడుకుతో కలిసి ఉన్నారు. కలిసి, వారు "నన్ను అనుసరించండి" అనే పాట పాడారు మరియు సమాజంతో తమ సొంత సంబంధాన్ని వివరించారు. "నూవోవి ఒరిజోంటి" సంఘం ద్వారా అనేక మంది యువకులు మరియు పెద్దలు వారి జీవితాలు ఎలా మారిపోయాయో మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. వారిలో కొందరు పోప్ ప్రశ్నలు అడిగారు. ఇది మధ్యాహ్నం 12:20 వరకు కొనసాగింది.

పోప్ ఫ్రాన్సిస్ అక్కడ దివ్యబలిపూజ  జరుపుకున్నారు, ఈ సమయంలో ఆండ్రియా బోసెల్లి కమ్యూనియన్ మరియు రిసెషనల్ స్తోత్రా గీతాలను పాడారు. ప్రార్ధన ముగింపులో, సమాజంలోని పవిత్ర సభ్యులు చర్చి యొక్క సేవలో వారి నిబద్ధతను తెలియజేసారు .
భోజనం తిన్న తరువాత, పోప్ ఈ సదుపాయంలో పనిచేస్తున్న సిబ్బందిని కలుసుకుని, ఆలివ్ చెట్టును నాటడానికి బయటికి వెళ్ళాడు. తరువాత అతను వాటికన్కు తిరిగి రావడానికి సాయంత్రం 4:50 గంటలకు అక్కడనుండి సెలవు తీసుకున్నారు

Add new comment

7 + 3 =