సింగారం మరియమాత అద్భుత దర్శన వార్షికోత్సవం

వరంగల్ మేత్రాసనం సింగారం విచారణలో 25 జూన్ 2022 శనివారం రోజున సింగారం మరియమాత అద్భుత దర్శన 5వ వార్షికోత్సవం మరియు లూర్దుమాత మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురుశ్రీ సిరిల్ దాస్ గారు వేడుకలకు ప్రధానార్చకులుగా దివ్యబలిపూజను సమర్పించారు. గురుశ్రీ సిరిల్ దాస్ గారు మరియతల్లి గొప్పతనం గురించి, కథోలిక విశ్వాసం గురుంచి వివరించారు. వేడుకలకు గురువులు, మఠవాసులు, విశ్వాసులు అధికసంఖ్యలో హాజరయ్యారు. విచారణ కర్తలు వేడుకలకు విచ్చేసిన గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, సంఘపెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. 

Add new comment

5 + 9 =