శ్రీకాకుళం మేత్రాసనంలో సవరకోటపాడు విచారణ వార్షికోత్సవం

శ్రీకాకుళం మేత్రాసనం సవరకోటపాడు విచారణ నందు పునీత రాయప్ప గారి దేవాలయ మహోత్సవములు 12జూన్ 2022న ఉదయం 10:00 గంటకు ఘనంగా జరిగాయి.

శ్రీకాకుళ మేత్రానులు మహా ఘన రాయరాల విజయకుమార్ తండ్రిగారు, విచారణలో నూతనంగా నిర్మించిన లూర్దుమత గుహను ఆశీర్వదించి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. 80మంది చిన్నారులు నూతనంగా ప్రధమ దివ్యసత్ప్రసాదమును స్వీకరించారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.

మహోత్సవానికి విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విచారణ కర్తలు గురుశ్రీ పి. చార్లెస్ గారు పండుగ పూజకు విచ్చేసిన మేత్రానులకు, గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, విచారణ ప్రజలకు, సంఘపెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సవరకోటపాడు విచారణను ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ దీవించాలని కోరుకుంటూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు.

Add new comment

1 + 2 =