శ్రీకాకుళం మేత్రాసనంలో యేసు తిరుహృదయ దేవాలయ వార్షికోత్సవములు

 

శ్రీకాకుళం మేత్రాసనం, దండుసూరగూడ గ్రామం, కే.డి.జోల విచారణనందు యేసు తిరుహృదయ దేవాలయ 24వ వార్షిక మహోత్సవములు 26 జూన్ 2022న ఉదయం 10:00 గంటకు ఘనంగా జరిగాయి.

శ్రీకాకుళ మేత్రానులు మహా ఘన రాయరాల విజయకుమార్ తండ్రిగారు దివ్యబలిపూజను సమర్పించారు. గురుశ్రీ విజయచందర్ గారు విశ్వాసులందరికి యేసు తిరుహృదయ గొప్పతనాన్ని, కథోలిక జీవితంలో భద్రమైన అభ్యంగన దివ్యసంస్కారముల యొక్క విశిష్టతను తెలియజేసారు. మహోత్సవంలో గురుశ్రీ ఇస్సాక్ గారు కూడా విశ్వాసులకొరకు ప్రార్ధించారు. మహా ఘన రాయరాల విజయకుమార్ తండ్రిగారు విశ్వాసులకు భద్రమైన అభ్యంగమును ప్రసాదించి ఆశీర్వదించారు. దండుసూరగూడ గ్రామం నుంచి దాదాపు 70మంది విశ్వాసులు  భద్రమైన అభ్యంగమును స్వీకరించారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.

మహోత్సవానికి విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విచారణ కర్తలు గురుశ్రీ బాలరాజు గారు పండుగ పూజకు విచ్చేసిన మేత్రానులకు, గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు, విచారణ ప్రజలకు, సంఘపెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కే.డి.జోల విచారణను ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ దీవించాలని  అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

5 + 3 =