శ్రీకాకుళం మేత్రాసనంలో క్రైస్తవ సహాయమాత మహోత్సవములు

శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత కథెడ్రల్ లో మే 22,2022 ఆదివారం రోజున క్రైస్తవ సహాయమాత మహోత్సవములు ఘనంగా జరిగాయి.
శ్రీకాకుళ మేత్రానులు మహా ఘన రాయరాలా విజయ్ కుమార్ తండ్రిగారు సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.
దివ్యపూజలో తండ్రిగారు సహాయమాత యొక్క ఔనత్యాన్ని,తల్లి విలువలను గూర్చి తెలియజేశారు. విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.
విచారణ గురువులు గురుశ్రీ పాలభూషణ్ గారు పూజాబలిని సమర్పించిన తండ్రిగారికి గారికి, పండుగ పూజకు విచ్చేసిన గురువులకు, మఠకన్యలకు, విశ్వాసులకు, విచారణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

 
 
 

Add new comment

2 + 1 =