శ్రీకాకుళంలో భక్త సంఘాల మెగా సమావేశం

శ్రీకాకుళంభక్త సంఘాల మెగా సమావేశం

శ్రీకాకుళం మేత్రాసనంలోని మరియగిరి పుణ్యక్షేత్రంలో 11 జూన్ 2022 న శ్రీకాకుళం మేత్రాసనం భక్త సంఘాల మెగా సమావేశం జరిగింది.

ఫ్రాన్సిస్ పాపు గారి పిలుపును అనుసరించి మానవ రక్షణ కార్య సాధనలో, దైవ జన సంఘం కలిసి నడవాలని, సువార్త వ్యాప్తిలో, దైవ రాజ్య స్థాపనలో భక్త సంఘాలైన మరియదళం, విన్సెన్ట్ డి పాల్, యువత, గాయక బృందం మరియు పూజ సహాయకులను భాగస్వాములను చేయాలన్న పిలుపునందుకొని శ్రీకాకుళ పీఠాధిపతులు మహా పూజ్య. రాయరాల విజయ్ కుమార్ గారు, మేత్రాసనంలోని అన్ని భక్త సంఘాలకు సమావేశాన్ని ఏర్పాటు చేసారు.

ఈ సమావేశానికి శ్రీ డి. అబ్రహాం గారు ప్రధాన వక్తగా విచ్చేసి అన్ని భక్త సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు.  దైవ రాజ్య స్థాపనలో, సువార్త వ్యాప్తిలో ఆయా సంఘాల పాత్రలను తెలియజేసారు. వారు అనుసరించ వలసిన మార్గాన్ని, మరియు మెళకువలను వారికి వివరించారు. 

మేత్రాసనంలోని అందరు భక్త సంఘాల సభ్యులు సువార్త వ్యాప్తిలో, వివిధ విచారణల ఆధ్యాత్మిక అభివృద్ధికి పునరంకితం కావాలని మహా పూజ్య. రాయరాల విజయ్ కుమార్ గారు అభ్యర్ధించారు.

ఈ సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికి గురుశ్రీ భోగి సంజీవరావు గారు కృతఙ్ఞతలు తెలిపారు.

ఉదయం 9 : 30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 : 30 గంటలకు అతిధులకు సన్మానంతో ముగిసింది.

Add new comment

6 + 6 =