వైభవంగా జరిగిన కారుణ్య మాత మండపం ప్రారంభోత్సవం

వైభవంగా జరిగిన కారుణ్య మాత మండపం ప్రారంభోత్సవం

కడప మేత్రాసనం లోని పాలెం పల్లె లో ఏర్పాటు చేసిన కారుణ మాత మరియమాత స్వరూపం, మండపం ప్రారంభోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. కడప మేత్రాసన ఆధ్యాత్మిక గురువులు,  మరియాపురం విచారణ కర్తలు గురుశ్రీ  బిరుసు రాజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనం గా జరిగింది.  9 తేదీ నుంచి 18 వరకు ప్రతి రోజు సాయంత్రం నవదిన ప్రార్థనలు మరియు  దివ్యబలి పూజ బలి నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం గురుశ్రీ బిరుసు రాజా ఆరోగ్య మాత పుణ్య క్షేత్రం డైరెక్టర్ గురుశ్రీ  పెండ్లికట్ల అబ్రహాం లు దివ్య బలిపూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేవుని కరుణ మనకెంతో
అవసరమన్నారు కారుణ్య మాత తో కనికరం గల తల్లి అని కోరిన కోర్కెలు తీర్చే దేవమాత అన్నారు.  ఈ కార్యక్రమంలో గురుశ్రీ  అనిల్, గురుశ్రీ చంద్ర, గురుశ్రీ లూర్దు , గురుశ్రీ సుధాకర్, సిస్టర్స్, గ్రామ ఉపదేశి జ్యోతి భాస్కర్ మరియు  విచారణ ప్రజలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.

Add new comment

2 + 6 =