విశ్వాసులను నేరుగా కలువనున్న ఫ్రాన్సిస్ పాపు గారు

Courtyard of St. Damasus
పునీత దమసస్ గారి ప్రాంగణంలో విశ్వాసులను నేరుగా కలువనున్న ఫ్రాన్సిస్ పాపు గారు

విశ్వాసులను నేరుగా కలువనున్న ఫ్రాన్సిస్ పాపు గారు.

ఐదు సుదీర్ఘ నెలల తర్వాత ఫ్రాన్సిస్ పోప్ గారు సందర్శకులను విశ్వాసులను కలవబోతున్నారు. కరోనా వల్ల తక్కువ సంఖ్యలో విశ్వాసులను అనుమతిస్తున్నారు. అన్ని ముందు జాగ్రత్త ఆరోగ్య చర్యలు తీసుకొని విశ్వాసులను పోప్ గారి వద్దకు అనుమరుస్తారని వాటికన్ రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడి చేసారు.

పోప్ గారు విశ్వాసులకు తన సత్యోపదేశ సందేశాన్ని ప్రజలకు నేరుగా ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది.

ఈ చర్యలలో భాగంగా 500 మంది విశ్వాసులను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. రెండవ చర్యగా ఎప్పటిలా సెయింట్ పీటర్స్ స్క్వేర్ నందు కాక పునీత దమసస్ గారి ప్రాంగణంలో జరుగుతుందని తెలిపారు.

పోప్ గారి సమావేశాలకు హాజరు కావలసిన కథోలిక పెద్దలు ముందుగా ఈ ప్రాంగణంలో బస చేసేవారు. అంతకు పూర్వం రెండవ జాన్ పాల్ పాపు గారు యువతీయువకులను కలవడానికి, వారితో సమావేశాలు జరపడానికి ఈ ప్రాంగణమును ఉపయోగించేవారు.

ఇప్పుడు ఫ్రాన్సిస్ పాపు గారు తన ఆంతరంగిక ప్రదేశమైన ఈ ప్రాంగణాన్ని విశ్వాసులను కలవడానికి ఉపయోగించనున్నారు. ఈ ప్రాంగణం చిన్నది అయినందున హాజరు అయ్యేవాళ్ళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి సులువుగా ఉంటుందని, ఈ ప్రాంగణాన్ని ఉదయం 7 గంటల 30 నిమిషాలకు విశ్వాసులకు తెరచి ఉంచుతామని ఎటువంటి ప్రవేశ రుసుము తీసుకోబడదని వాటికన్ రక్షణ శాఖ వారు ప్రకటించారు.

Add new comment

3 + 3 =