విశాఖపురి మేరిమాత మహాత్సవము

విశాఖపురి మేరిమాత మహాత్సవము 

    
విశాఖ కొండగుడిలో అమలోద్భవి మాత మహోత్సవం ఘనంగా జరిగింది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎప్పటిలానే నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు నవదిన ప్రార్ధనలు జరిగాయి. డిసెంబర్ 8వ తేదీన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.   ఉదయం 4.౩౦  గంటల నుంచి దివ్య పూజాబలిలు ప్రారంభమైనాయి. ఉదయం కొండ పై గృహ దగ్గర   7.౩౦గంటలకు మహా ఘన. డా అంతోనీ పూల, హైద్రాబాద్ అగ్రపీఠాధిపతులు, మహా ఘన. డా.మల్లవరపు ప్రకాష్, విశాఖ అగ్ర పీఠాధిపతుల ఆధ్వర్యంలో పొంటిఫికల్ దివ్య పూజాబలి నిర్వహించారు.  మేరీమాతను దర్శించుకొని కొవ్వొత్తులు వెలిగించిన భక్తులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర  డైరెక్టర్ గురుశ్రీ కొండల జోసెఫ్  విచ్చేసిన గురువులకు, మతకన్యలకు , విశ్వాసులకు వందనాలు తెలియ జేశారు.

మేరీమాత భక్తులకు అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు తరుపున  పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Add new comment

8 + 3 =