విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ లో నూతన దేవాలయ ప్రతిష్ఠ

గుడివాడ విచారణనూతన దేవాలయ ప్రతిష్ఠ

25 మే 2022 న విజయవాడ మేత్రాసనం, గుడివాడ విచారణలో నూతనంగా మౌంట్ కార్మెల్ మాత దేవాలయం ప్రతిష్టించబడింది.

విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య. రాజారావు తెలగతోటి మరియు శ్రీకాకుళం పీఠాధిపతి మహా పూజ్య. రాయరాల విజయ్ కుమార్ గారు సమిష్టిగా ఈ దేవాలయ ప్రతిష్ట చేసారు.

25 మే 2022 సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. మొదటిగా విచారణ గురువులు గురుశ్రీ గంటా ప్రవీణ్ గారు దేవాలయ తాళాలను విజయవాడ మేత్రాసన కాపరి మహా పూజ్య. రాజారావు తెలగతోటి గారికి అప్పగించారు. అనంతరం  శ్రీకాకుళం పీఠాధిపతి మహా పూజ్య. రాయరాల విజయ్ కుమార్ గారు దైవ వాక్కు పీఠాన్ని ఆశీర్వదించారు. క్రిస్మా తైలముతో దేవాలయంలో బలిపీఠాన్ని పీఠాధిపతులిద్దరు ఆశీర్వదించారు. 

దేవాలయం లోని స్వరూపాలు మరియు దివ్యబలిపూజకు వాడే అన్ని వస్తువులను పీఠాధిపతులు ఆశీర్వదించారు. గురుశ్రీ యోహాను గారు మరియు గురుశ్రీ ప్రతాప్ గారి సారధ్యంలో గాయక బృందం సుమధుర గీతాలను ఆలపించారు. 

ఈ దేవాలయ ప్రతిష్టకు అనేక మంది గురువులు, కన్యస్త్రీలు మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ విచారణ గురువులు గురుశ్రీ గంటా ప్రవీణ్ గారు మరియు సహాయక విచారణ గురువులు గురుశ్రీ బండి కిరణ్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.  

Add new comment

4 + 0 =