విజయవాడలో ఘనంగా "భారత క్రైస్తవ దినోత్సవం"

భారత క్రైస్తవ దినోత్సవంవిజయవాడ మేత్రాసనం

క్రీస్తు ప్రభువు యొక్క పండ్రెండు మంది శిష్యులలో ఒకరైన పునీత తోమా గారు క్రీస్తు శకం 52 వ సంవత్సరంలో జులై 3 న భారతదేశంలో అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని  ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా జులై 3 వ తారీకును " భారత క్రైస్తవ దినోత్సవం" గా భారతీయ క్రైస్తవులందరూ కొనియాడుతున్నారు.

విజయవాడ లోని " సెయింట్ పౌల్స్ కథెడ్రల్" నందు 03 జులై 2022 నాడు సంస్మరణ కూడిక జరిగింది. విజయవాడ లోని అన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మరియు విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మిషినరీలు మన భారతదేశంలో విద్య, వైద్య, వ్యవసాయ, పరిశ్రమ, ప్రింటింగ్ వంటి రంగాలలో కూడా అభివృద్ధి పధంలో నడువబడుటకు మరియు సాంఘీక సంస్కరణలో ఉన్న మూఢ నమ్మకాలను తొలగించడంలోనూ ఎనలేని సేవలను త్యాగశీలతతో అందించడం అభినందనీయమని గుర్తించి మననం చెయ్యడం జరిగింది. అదే స్ఫూర్తితో భారతదేశం అభివృద్ధి కొరకు అందరు పనిచేయాలని గుర్తు చేసుకోవడం జరిగింది.

విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు మరియు బిషప్ కర్నోలిస్ గార్ల అధ్యక్షతన గురుశ్రీ మువ్వల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాల సభ్యులు, పాస్టర్ పాకలపాటి ప్రభాకర్, పాస్టర్ విశ్వ ప్రసాద్, తోటి మోసెస్, పాస్టర్ సత్యం, పాస్టర్ కరుణానిధి మొదలైనవారు మరియు కోరుకొండ అశోక్ కుమార్, బాబు రావు తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్తులైయ్యారు. 

భారత క్రైస్తవ దినోత్సవానికి క్రైస్తవ సంఘాల సభ్యులు మరియు అనేకమంది విశ్వాసులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.

Add new comment

1 + 7 =