విజయనగరం లో జ్యోతిర్మయి బైబిల్ పరీక్ష

విజయనగరం లో జ్యోతిర్మయి  బైబిల్ పరీక్ష

విజయనగరం పునీత ఆంథోనీ వారి విచారణ లో జ్యోతిర్మయి  బైబిల్ పరీక్ష నిర్వహించారు.   
విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు మర్నేని గారి ఆధ్వర్యంలో కాథోలిక టీచర్ల సమక్షంలో ఈ పరీక్షను నిర్వహించారు.

పిల్లలను  బైబిల్ని చదువుతూ అందులోని విషయాల్ని అర్థంచేసుకోవడానికి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరికను పెంచడానికి ఈ బైబిల్ పరీక్ష ఎంతో సహాయపడుతుంది.
సెయింట్  జోసెఫ్స్  ఇంగ్లీష్  మీడియం  హై  స్కూల్,  కంటోన్మెంట్ లో జ్యోతిర్మయ  బైబిల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు విచారణ పిల్లలు, పెద్దవారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

టీచర్ షీబా గారు మాట్లాడుతూ  పిల్లలను ప్రతి ఆదివారం బైబిల్ క్లాస్ (catechism) కు పంపించాలని, పిల్లలను దేవుని మార్గంలో నడిపిస్తూ   "దేవుని స్నేహితులుగా"  మేము(టీచర్ల) మార్చుతాము అని అన్నారు.

విచారణ కర్తలు గురుశ్రీ లూర్దు మర్నేని గారు జ్యోతిర్మయి  బైబిల్ పరీక్ష కు హాజరైన ప్రతిఒక్కరిని అభినందించారు.

 

 

Add new comment

3 + 3 =