వాటికన్ పీఠాధిపతుల డికాస్టరీలో నూతనంగా ముగ్గురు మహిళలను నియమించిన పాపు గారు  

మహిళలు నియమించబడ్డారుసిస్టర్ రాఫ్ఫాఎల్ల పెట్రీని, సిస్టర్ ఎవోన్ని రేఉన్గోట్ మరియు డాక్టర్, లియా జర్వినో

ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పీఠాధిపతులను గుర్తించే బాధ్యత కలిగిన డికాస్టరీలో మొదటిసారి మహిళలు నియమించబడ్డారు. వాటికన్ పీఠాధిపతుల డికాస్టరీలో విధులు నిర్వర్తించడానికి నూతనంగా ముగ్గురు మహిళలను ఫ్రాన్సిస్ పాపు గారు నియమించారు.

సిస్టర్ రాఫ్ఫాఎల్ల పెట్రీని, సిస్టర్ ఎవోన్ని రేఉన్గోట్ మరియు డాక్టర్  మరియ లియా జర్వినో గార్లను పాపు గారు వాటికన్ పీఠాధిపతుల డీనరిలో విధులు నిర్వర్తించడానికి నూతనంగా నియమించారు.

సిస్టర్ రాఫ్ఫాఎల్ల పెట్రీని గారు వాటికన్ సిటీ స్టేట్ గవర్నరేట్ సెక్రటరీ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు, ఎవోన్ని రేఉన్గోట్ గారు డాటర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ యొక్క మాజీ సుపీరియర్ జనరల్ గా పని చేసారు మరియు డాక్టర్  మరియ లియా జర్వినో గారు వరల్డ్ యూనియన్ ఆఫ్ కాథలిక్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు.

గతంలో ఫ్రాన్సిస్ పాపు గారు వాగ్దానం చేసినట్లు, మహిళలకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది.

డాక్టర్ మరియ లియా జర్వినో గారు సామాన్య ప్రజలలో నుండి ఎన్నికైన ఒక స్త్రీ. ఇటువంటి స్థానానికి ఎంపికైన మొదటి స్త్రీ ఈమె.

Add new comment

3 + 0 =