వర్షాలతో,వరదల తో మునిగిన వరంగల్‌

వర్షాలతో,వరదల తో వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది.వర్షం కారణంగా వరంగల్ నగరంలో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్‌ లోని  అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.హైదరాబాద్‌కు చెందిన డీఆర్ఎఫ్ (DRF) బృందాలు  ప్రస్తుతం వరంగల్‌లో సేవలను అందిస్తున్నాయి.వర్షాలు, వరదల కారణంగా విద్యుత్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 14.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ  తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్బపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయని హైదరబాద్ వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..

Add new comment

5 + 0 =