వరదల కారణంగా సర్వం కోల్పోయినవారికి నెళ్ళిపాక విచారణ గురువుల సహాయం

 
 
ఇటీవల కురిసిన కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అందులో ఖమ్మం మేత్రాసనంలోని వి.ఆర్.పురం మరియు కూనవరం గ్రామాలు ముంపుకు గురైన 200 కుటుంబాల ప్రజలు కనీస సరుకులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు.  
 
నెళ్ళిపాక విచారణ కర్తలు గురుశ్రీ కొమ్ము అంతోని గారు ప్రజల సమస్యను గుర్తించి తనతో పాటుగా ఇద్దరు మఠకన్యలతో కలిసి ఆగష్టు 3వ తేదీన సర్వం కోల్పోయిన 200 కుటుంబాల వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. 
 
 అత్యవసర సమయంలో, ఎంతో కష్టపడి తమ దగ్గరకు వచ్చి ప్రేమను పంచిన కన్యస్త్రీలకు మరియు గురుశ్రీ కొమ్ము అంతోని గారికి అక్కడ ఉన్న వరద భాదితులంతా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
 
గురుశ్రీ కొమ్ము అంతోని గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆ దేవాది దేవుని కృప ఎల్లప్పుడూ మీ పై ఉండాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.
 
Article by
Chandana Pramada
RVA telugu service

Add new comment

1 + 0 =