లోక రక్షకుడు పుట్టిన రోజు ఈ క్రిస్మస్

 లోక రక్షకుడు పుట్టిన రోజు ఈ క్రిస్మస్

 ప్రజలను పాపాల నుంచి రక్షించటానికి సాక్షాత్తు  దేవుడే  సాధారణ మనిషిగా భూమిపై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ.

ప్రభు ఏసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ గా జరుపుకుంటున్నాము .  జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ ఆదరణ కర్తగా ,రక్షకుడు గా తన ప్రజలకు చేరువలోనే ఉన్నారు .

ప్రభు ఏసు క్రీస్తు  పుట్టుక సాధారణమైన అంశం కాదు. క్రీస్తు జననానికి 600 సంవత్సరాల ముందే ఆయన పుట్టుక గూర్చి జ్ఞానులు తెలిపారు. క్రీస్తు జననం వల్ల రెండు అపూర్వ ఘట్టాలు ఆవిష్కరించాయి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా గుర్తింపులోకి వచ్చాయి.  

క్రీస్తు జననం బెత్లెహెం దేశంలోని పశువుల పా కలో జరిగింది. ఆయన జనన సమాచారం తొలుత గొ ర్రె కాపరులకు అందుతుంది. యేసుక్రీస్తును తొలి సా రిగా దర్శించిన వారు గొల్లలుగా బైబిల్‌ చెబుతుంది.

క్రిస్మస్‌ అంటే క్రీస్తును ఆరాధించడం అని అర్థం. క్రైస్ట్‌ అంటే అభిషిక్తుడు (క్రీస్తు), మస్‌ అంటే ఆరాధన. అభిషిక్తుడిని ఆరాధించడం అనేది క్రిస్మస్‌ పరమార్థం.

క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు.
క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకో వడమనే జర్మన్‌ల నుంచి వచ్చిన సంప్రదాయమని తెలుస్తోంది. మధ్య యుగంలో డిసెంబర్ 24న జర్మన్‌లు ఈడెన్‌ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్‌ చెట్టుకి ఆపిల్‌ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వారు పారడైస్‌ చెట్టుగా పిలుచుకునే వారు. ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మన్ నుంచి  బ్రిటన్‌లోకి వచ్చింది. బ్రిటన్ లో ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, స్వీట్లు వంటివాటితో డెకరేట్ చేయం ప్రారంభించారు.
అలా ఈ  సంప్రదాయం కెనడాలోకి కూడా వచ్చింది. ఆ తరువాత దాదాపు 100 సంవత్సరాలకు అమెరికాలోకి అడుగుపెట్టింది. ఇక సాధారణంగా ఇళ్లలో పెట్టుకునే క్రిస్మస్‌ చెట్లు ఇరవయ్యో శతాబ్దం వచ్చే సరికి బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేశాయి.
అమెరికాలో అనేక పబ్లిక్ ప్లేసుల్లో భారీ క్రిస్మస్‌ చెట్లను పెడుతుంటారు. ఇలా 1923 నుంచి అమెరికా శ్వేత భవనంలో క్రిస్మస్‌ చెట్టు అమర్చడం ప్రారంభమైంది. దీంతో ప్రతి ఏడాది ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్‌ వేడుకలు ప్రారంభమవుతాయి

`క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు త మ ఇళ్లపై ’స్టార్‌’ను ఏర్పాటు చేస్తారు. క్రీస్తు పుట్టుక కు నక్షత్రాన్ని సూచికగా పరిగణిస్తారు. బెత్లెహెం దేశంలో తూర్పున భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు గుర్తిస్తారు.  జ్ఞానులు నక్షత్ర వెలుగు ఆధారం గా బాలయేసు జన్మించిన పశువుల పాక వద్దకు చేరుకుంటారు. బాలయేసును ప్రార్థిస్తారు.

 ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు .

Add new comment

1 + 19 =