లూర్దుమాత దేవాలయ ప్రతిష్ఠోత్సవం.

ఖమ్మం మేత్రాసనం, రామక్రిష్ణాపురం విచారణ, అనంతసాగర్ గ్రామమునందు లూర్దుమాత దేవాలయ ప్రతిష్ఠ మే 31, 2022న ఘనంగా జరిగింది. ఖమ్మం మేత్రానులు మహా పూజ్య మైపాన్ పాల్ తండ్రి గారు ఈ దేవాలయ ప్రతిష్ట చేసారు.

దేవాలయం లోని స్వరూపాలు మరియు దివ్యబలిపూజకు వాడే అన్ని వస్తువులను పీఠాధిపతులు ఆశీర్వదించారు. "మరియ తల్లి జీవితంలో ఆ దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినట్లు మనందరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేశారు" అని పీఠాధిపతులవారు అన్నారు.

ఈ దేవాలయ ప్రతిష్టకు గురుశ్రీ మాదాను రాజు, గురుశ్రీ సూరేపల్లి ఐసాక్,గురుశ్రీ కొరివి థామస్,గురుశ్రీ కిరణ్ కుమార్ మేడిపల్లి, గురుశ్రీ ఏ శాంతి కుమార్, గురుశ్రీ ఇన్నా రెడ్డి , బ్రదర్ స్టీవెన్ మరియు బ్రదర్ సంతోష్ గార్లు మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ విచారణ గురువులు గురుశ్రీ పసల సంపత్ కుమార్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.

Add new comment

2 + 1 =