లిటిల్ ఫ్లవర్ పాఠశాల వద్ద బాంబు పేలుడు 

బాంబు పేలుడులిటిల్ ఫ్లవర్ పాఠశాల

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లోని లిటిల్ ఫ్లవర్ క్యాథలిక్ స్కూల్ గేట్‌పై జూన్ 5 తెల్లవారుజామున 3.10 గంటలకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు శక్తివంతమైన గ్రెనేడ్‌ను పేల్చారు.

అదృష్టవశాత్తూ, ప్రాణనష్టం జరగలేదు. అయితే, పాఠశాల భవనంలోని కొన్ని భాగాలు, కిటికీ అద్దాలు, ప్రధాన గేటు భారీగా దెబ్బతిన్నాయని పాఠశాల అధికారులు తెలిపారు.

ఈ దాడికి ఇప్పటి వరకు ఎవరు బాధ్యత వహించలేదు.

పాఠశాలలో జరిగిన పేలుడును ఖండిస్తూ, విద్యార్థులు మరియు సిబ్బంది జూన్ 6న పాఠశాల గేటు ముందు శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఇంఫాల్ నగరం మరియు అన్ని పాఠశాలల్లో హింస రహిత విద్యా జోన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

జూన్ 5న ఆల్ మణిపూర్ క్యాథలిక్ యూనియన్ వారు పేలుడుకు పాల్పడ్డ బృందాన్ని ఖండించింది మరియు పేలుడుకు కారణమైన నేరస్థులపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

జూన్ 5, ఆదివారం, క్యాథలిక్ పాఠశాలలో జరిగిన బాంబు పేలుడు గురించి ఇంఫాల్ అగ్రపీఠాధిపతి  మహా పూజ్య. డొమినిక్ లుమోన్‌తో కలిసి క్యాథలిక్ ఎడ్యుకేషన్ సొసైటీ మణిపూర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఒక గంట చర్చల తర్వాత; తీర్మానాలను ఆమోదించాలని తీర్మానించారు.

దీని ప్రకారం జూన్ 6న లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, మధ్యాహ్నం 1.00 గంటలకు లిటిల్ ఫ్లవర్ స్కూల్, క్యాథలిక్ ఎడ్యుకేషన్ సొసైటీ మణిపూర్, ప్రైవేట్ స్కూల్ ప్రతినిధి విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మణిపూర్ ముఖ్యమంత్రి మరియు విద్యా మంత్రికి మెమోరాండం సమర్పించాలని నిర్ణయించుకున్నారు.

లిటిల్ ఫ్లవర్ స్కూల్‌కు సంఘీభావంగా, మణిపూర్ రాష్ట్రంలోని అన్ని క్యాథలిక్ పాఠశాలలు జూన్ 7, మంగళవారం మూసివేయబడ్డాయి.

Add new comment

4 + 6 =