రైతులు చేసిన పోరాటానికి దిగొచ్చిన కేంద్రం

రైతులు చేసిన పోరాటానికి దిగొచ్చిన కేంద్రం :

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతేడాది నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గతేడాది నుండి  పంజాబ్, హర్యానా  ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.  ఢిల్లీ శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి వున్నారు . అక్కడే తిండి, అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
ఈరోజు శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

 

 

Add new comment

1 + 1 =