రెండవ ఎలిజబెత్ రాణి గారు లోతైన నిబద్ధత కలిగిన క్రైస్తవురాలు - బ్రిటన్ రాయబారి

వాటికన్‌రెండవ ఎలిజబెత్ రాణి

రెండవ ఎలిజబెత్ మహారాణి గారు తన జీవితకాలంలో ఐదుగురు పోప్‌లను కలిశారు, ఆమె గ్రేట్ బ్రిటన్ రాణిగా 70 సంవత్సరాలలో నలుగురిని కలిశారు.

1951లో ఎలిజబెత్ రాణి అధికారం లోనికి రావడానికి ఒక సంవత్సరం ముందు అప్పటి పాపు గారితో మొదటి సమావేశం జరిగినప్పటి నుండి వాటికన్‌తో యునైటెడ్ కింగ్‌డమ్ సంబంధం ఎంతగా మారిపోయిందో బ్రిటిష్ రాయబారి క్రిస్టోఫర్ ట్రాట్ వివరించారు.

ఆ సమయంలో, మేము వాటికన్ కి రాయబార కార్యాలయాన్ని కలిగి ఉన్నప్పుడు, మాకు రాయబారి లేరు, మా సంబంధం డిప్యూటీ అంబాసిడర్ స్థాయిలో చార్జీగా లేదా మేము మంత్రిగా పిలిచే స్థాయిలో ఉంది. కాబట్టి ఎలిజబెత్ రాణి గారి జీవితంలో, ఈ బాంధవ్యం సాధారణ స్థాయి నుండి పూర్తి రాయబారి స్థాయి సంబంధానికి వెళ్లడాన్ని మేము చూశాము అని ఆయన అన్నారు.

రెండవ జాన్ పాల్ పాపు గారి గ్రేట్ బ్రిటన్‌కు అతని మతసంబంధమైన పర్యటన తర్వాత 16వ శతాబ్దపు చివరి నుండి వాటికన్‌కు పంపబడిన మొదటి బ్రిటీష్ రాయబారులు 1982లో గుర్తింపు పొందారు.

దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత, పోప్ బెనెడిక్ట్ XVI స్కాట్లాండ్‌లోని రాణి గారిని UKలో పాపు గారి యొక్క మొదటి రాష్ట్ర పర్యటన సందర్భంగా కలుసుకున్నారు, ఇది విశ్వాసం ఆధారంగా స్థాపించబడిన పోప్‌లు మరియు క్వీన్‌ల పరస్పర గౌరవానికి పాక్షికంగా రాయబారి ఘనత సాధించారు.

రెండవ ఎలిజబెత్ రాణి గారు లోతైన నిబద్ధత కలిగిన క్రైస్తవురాలని బ్రిటిష్ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు అని క్రిస్టోఫర్ ట్రాట్ గుర్తు చేసారు.

ఆమెను గతంలో కలిసిన పాపు గార్లందరూ ఆమెను లోతైన క్రైస్తవ విశ్వాసం ఉన్న వ్యక్తిగా గౌరవించారు.

ఆంగ్లికన్ చర్చి యొక్క నామమాత్రపు అధిపతిగా బ్రిటిష్ చక్రవర్తి పాత్రను కలిగి ఉండగా, ఎలిజబెత్ రాణి అన్ని విశ్వాసాలను అంగీకరించడం ఆమె పాలన యొక్క ప్రధాన సిద్ధాంతం, ఆమె కుమారుడు మరియు వారసుడు కూడా ఆమె అడుగుజాడలలో ముందుకు సాగుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

రాయబారి అయిన క్రిస్టోఫర్ ట్రాట్ గారు ఇంగ్లాండ్మ లో కథోలిక చర్చ్ సహకరించే విస్తృత శ్రేణి సమస్యలను గుర్తు చేసారు. గత సంవత్సరం, వాటికన్ కు బ్రిటీష్ రాయబార కార్యాలయం విశ్వాసం మరియు విజ్ఞాన శాస్త్రంపై ఒక సమావేశాన్ని ప్రచారం చేసింది, ఇది గ్లాస్గోలో COP26 వాతావరణ శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత పెద్దలను వాటికన్‌కు తీసుకువచ్చింది.

Add new comment

1 + 4 =