రాసాయిన శాస్త్రంలో సిస్టర్ విజయరాణి విజయం 

ఆంధ్ర విశ్వవిద్యాలయంసిస్టర్ విజయరాణి

గుంటూరు జిల్లా, పాటిబండ్ల గ్రామానికి చెందిన సిస్టర్ అల్లం విజయరాణి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఈ మేరకు 26 సెప్టెంబర్ 2022 న విశ్వవిద్యాలయం వారు ఒక ప్రకటన విడుదల చేసారు. 

పెరుగుతున్న భూగర్భ జలాల కాలుష్యం దృష్ట్యా, భూగర్భ జలాలలో ఉండే ఆర్సెనిక్ లోహం ఎంత శాతం ఉంది? దాని నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు మరియు నివారణకు సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు గాను సిస్టర్ విజయరాణి గారికి గౌరవ  డాక్టరేట్ ను ఇస్తున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు చెప్పారు. అత్యంత క్లిష్టమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తీ చేసినందుకు ఏ యూ వైస్ ఛాన్సలర్ సిస్టర్ విజయరాణి గారిని ప్రత్యేకంగా అభినందించారు. 

తమ మేత్రాసనానికి చెందిన ఒక కన్యస్త్రీ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించి, గౌరవ డాక్టరేట్ పొందినదుకుగాను గుంటూరు మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య చిన్నాబత్తిని భాగ్యయ్య గారు ఆమెను అభినందించారు. సెయింట్ ఆన్స్ మదర్ జనరల్ సిస్టర్  అంతోనమ్మ గారు మరియు సిస్టర్ పాల్ ట్రీసా, సిస్టర్ ఆన్ రోస్ గార్లు కూడా సిస్టర్ విజయరాణి గారిని అభినందించారు.

Add new comment

9 + 4 =