రక్తదాన శిభిరం

హైదరాబాద్ అగ్రపీఠం, హస్(HASSS)  కార్యలయము నందు రక్తదాన శిభిరం  ఏర్పాటు చేసారు. హైదరాబాద్ అర్చిడియోసెస్  సోషల్ సర్వీస్ సొసైటీ  (HASSS) వారు యూత్ కమిషన్ సహకారంతో ఈ రక్తదాన శిభిరం  ఏర్పాటు చేసారు.
హైదరాబాద్ అతిమేత్రానులు, మొట్టమొదటి తెలుగు  కార్డినల్  "మహా ఘన పూల అంతోని " తండ్రిగారు ముఖ్య అతిధి గా విచ్చేసారు.
మహా ఘన పూల అంతోని గారు  మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి తన  అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ అర్చిడియోసెస్  సోషల్  సర్వీస్ సొసైటీ డైరెక్టర్ గురుశ్రీ అంతోని గారు మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో రక్తం యొక్క అవశ్యకతను తెలిపారు.

యూత్ కమిషన్ డైరెక్టర్ గురుశ్రీ సునీల్ గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి  వల్ల  రక్తదాతలు తగ్గారని  , అత్యవసర పరిస్థితులలో బ్లడ్ బ్యాంకు లో సైతం రక్తం దొరకడం లేదని , యువతీ యువకులు ముందుకు వచ్చి ప్రతి విచారణ లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని,   అత్యవసర పరిస్థితులలో ఉన్నవారిని  ఆదుకోవాలని సూచించారు.    

హైదరాబాద్ అర్చిడియోసెస్  సోషల్  సర్వీస్ సొసైటీ డైరెక్టర్ గురుశ్రీ అంతోని గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

Add new comment

7 + 12 =