యూనిసర్విటేట్ అవార్డు గెలుచుకున్న 28 విశ్వవిద్యాలయాలు

 విశ్వవిద్యాలయాలుయూనిసర్విటేట్ అవార్డు

విస్తృతమైన ఎంపిక ప్రక్రియ తర్వాత, యూనిసర్విటేట్ అవార్డు మొదటి విడతలో 28 విశ్వవిద్యాలయాలు విజేతలుగా ప్రకటించబడ్డాయి.

"మీ-ది అదర్" అను కార్యక్రమాన్ని సృష్టించిన ఉక్రేనియన్ కథోలిక విశ్వవిద్యాలయం కూడా విజేతలతో ఒకటి. ఇది మూస పద్ధతులను అధిగమించడానికి వైకల్యాలున్న విద్యార్థులకు సహాయం చేయడానికి నాటకాలను ఉపయోగిస్తుంది.

ఈ పోటీ యువతను మరియు పర్యావరణాన్ని మెరుగుపరచడంలో వారి ప్రయత్నాలను ప్రదర్శించే ఒక చక్కటి అవకాశం. 

ఫ్రాన్సిస్ పాపు గారు మనల్ని కోరినట్లుగా, సిద్ధాంతపరంగా మాత్రమే కాకుండా, కట్టుదిట్టమైన కార్యక్రమాల ద్వారా మరియు విద్య ద్వారా సోదరభావాన్ని పెంపొందించాలని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు యూనిసర్విటేట్ అవార్డు డైరెక్టర్ నీవ్స్ టాపియా గారు అన్నారు.

యూనిసర్విటేట్ అవార్డు మొదటి విడత కోసం ప్రపంచం నలుమూలల నుండి సుమారు 200 దరఖాస్తులు వచ్చాయి.

ప్రపంచాన్ని మార్చడంలో విద్యార్థుల పాత్ర ఆకట్టుకుంటుంది. మరియు యువ విశ్వవిద్యాలయ విద్యార్థుల సృజనాత్మకత మరియు జ్ఞానం నిజంగా జీవితాలను మార్చగలవు అని నీవ్స్ టాపియా అభిప్రాయపడ్డారు.

మూడవ యూనిసర్విటేట్ గ్లోబల్ సింపోజియంలో పాల్గొనేందుకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థులతో తమ ప్రాజెక్ట్‌లు మరియు ఆలోచనలను పంచుకోవడానికి విజేత బృందాలు అక్టోబర్ 26-30 వరకు రోమ్‌ నగరంలో సమావేశమవుతాయి.

Add new comment

2 + 2 =