యువతా పరిచర్య శిక్షణ

కర్ణాటక, బెంగళూరు National Biblical Catechetical & Liturgical Centre నందు CCBI యువతి యువకుల డైరెక్టర్లుకు 15 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు.
 
జూన్ 1 నుంచి జూన్ 12 వ తేదీ వరకు నిర్వహించనున్నారు కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా యువత కమిషన్ సెక్రటరీ అయిన గురుశ్రీ చేతన్ మచాడో ఢిల్లీ అగ్ర మేత్రసనం, ICYM, ICM  వారి బృంద సభ్యులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

భారతదేశ నలుమూలల నుండి వివిధ సభలకు చెందిన గురువులు,కన్యాస్త్రీలు, యూత్ యానిమేటర్లు సుమారు 54 మంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి  హైదరాబాద్ అతిమేత్రాసనం, MSFS , HOLY CROSS, ST. ANN'S OF PROVIDENCE, పలమనేరు(CSA), తణుకు నుంచి పెంత్తుకొస్తు సంఘస్థులు, గురువులు, మరియు కన్యాస్త్రీలు పాలోన్నారు. 

ఈ సమావేశం మా అందరికీ అద్భుతమైన అనుభవాని, క్రొత్త విషయాలు నేర్చుకునే  అవకాశం ఇచ్చింది. భారతదేశం అంతటా ఉన్న యువతా ప్రతినిధులతో సంభాషించే అవకాశాన్ని కలగచేసింది" అని నిత్య సహాయమాత విచారణ, త్రిపురాంతకం, నెల్లూరు మేత్రాసన గురువులు    గురుశ్రీ సాగర్ సంతోష్ MSFS గారు అన్నారు .

Add new comment

1 + 3 =