యాప్రాల విచారణలో త్రిత్వైక సర్వేశ్వరుని దేవాలయ పండుగ

హైదరాబాద్ అగ్రపీఠం యాప్రాల విచారణ త్రిత్వైక సర్వేశ్వరుని దేవాలయ పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. జీవన్ ప్రెస్ డైరెక్టర్ గురుశ్రీ మెట్టు జయరాజు గారు ప్రధానార్చకులుగా దివ్యబలిపూజను సమర్పించి విశ్వాసులకు ప్రార్ధన చేశారు.

అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు త్రిత్వైక సర్వేశ్వరుని ఉనికిని క్రైస్తవ జీవితాల్లో ఉన్న ప్రాముఖ్యతను పాత నూతన నిబంధన గ్రంధములో త్రిత్వైక సర్వేశ్వరుని గురించి వ్రాయబడిన అంశములను గూర్చి త్రిత్వైక సర్వేశ్వరుని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయముల గురించి చాలా చక్కగా బోధించారు.

యాప్రాల విచారణ కర్తలు గురుశ్రీ బాల మరియు యాప్రాల స్కూల్ ప్రిన్సిపాల్ గార్లు దివ్యబలిపూజను సమర్పించారు. ఈ  మహోత్సవానికి విశ్వాసులు 50 మంది హాజరయ్యారు.

యాప్రాల విచారణను ఆ సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ దీవించాలని కోరుకుంటూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు.  

Add new comment

7 + 8 =