మొదలైన దివ్య బాలయేసు మహోత్సవ "త్రిదిన ప్రార్ధనలు"

మొదలైన దివ్య బాలయేసు మహోత్సవ "త్రిదిన ప్రార్ధనలు"

విశాఖ అతిమేత్రాసనం బొబ్బిలి విచారణ లోగల బాలయేసునగర్ (గొల్లవీధి) లో అద్భుత శక్తిగల దివ్య బాలయేసు మహోత్సవం "త్రిదిన ప్రార్ధనలు" మొదలయ్యాయి.    బొబ్బిలి విచారణ కర్తలు  గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ "త్రిదిన ప్రార్ధనలు" భక్తియుతంగా సాగుతున్నాయి.

ప్రజలను ఉత్తేజ పరుస్తూ గురుశ్రీ మోహన్ ప్రసాద్ గారు చేపడుతున్నమంచి  కార్యక్రమాలు ప్రజలను ప్రభు మార్గంలో నడిచేలా చేస్తున్నాయి.

దివ్య బాలయేసు మహోత్సవ త్రిదిన ప్రార్ధనలులో  ప్రతి రోజు సాయంత్రం 5-30 ని॥లకు “జపమాల”  మరియు 6 గం॥ లకు “దివ్య పూజబలి” జరుగుతున్నాయి . మొదటిరోజు  విశాఖమేత్రాసన  గురువులు, పల్లె  ప్రజలు దైవంగా భావించే గురుశ్రీ అంతయ్య గారు  ఈ  "త్రిదిన ప్రార్ధన"లలో పాల్గొని పండుగ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం  ఇతరగురువులతో కలసి దివ్యపూజాబలిను సమర్పించారు. గురుశ్రీ అంతయ్య గారు "బాలయేసుతో మాట్లాడిన పునీత బాల తెరెసామ్మ గారు" అనే అంశం పై ప్రసంగించారు.
రెండవరోజు  గురుశ్రీ ఎస్ సుధాకర్ గారు  "త్రిదిన ప్రార్ధన"లలో పాల్గొని బాలయేసుకి మనవి చేసిన పునీత అంతోనివారు  అనే అంశం పై ప్రసంగించారు.

బొబ్బిలి,గొల్లపల్లి,అలజంగీ,రంగరాయపురం,పాతబొబ్బిలి ,ఇందిరమ్మ కొలని ,గున్నతోటవలస ,పిరిడి,కోమటి పల్లి ఇతర చుట్టూ పక్కల గ్రామాల నుండి అధికసంఖ్యలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రజలు కు  ఎటువంటి ఆటకం కలగకుండా విచారణ సహాయక గురువు గురుశ్రీ యోహాన్ గారు తన సహాయ సహకారాలని అందిస్తున్నారు.

Add new comment

5 + 4 =