మేరీ మాత బాయ్స్

క్రిస్మస్ మరియ  కొత్త సంవత్సరం సంబరాలు
 
విశాఖ అతిమేత్రాసనం లో క్రిస్మస్ మరియ  కొత్త సంవత్సరం సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నం లోని కొబ్బరి తోటలో "మేరీ మాత  బాయ్స్"  ఏర్పాటు చేయనటువంటి పశువుల శాల అందరిని ఆకట్టుకొన్నది. మహారాణి పేట సహా విచారణ కర్తలు గురుశ్రీ  విమల్ రాజ్  గారు కొత్త సంవత్సరం సందర్భముగా  కొబ్బరి తోట ను ఆదివారం నాడు  సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. గురుశ్రీ  విమల్ రాజ్  గారు  మేరీ మాత  బాయ్స్ ను అభినందించారు.ప్రజలందరూ క్రిస్మస్ సందర్భముగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకే దీపారాధన లో పాల్గొన్నారు .
మేరీ మాత  బాయ్స్ లో ఒకరైన  మాధవ మాట్లాడుతూ  క్రిస్మస్ తమకు పెద్ద పండుగ అని, ఈ లోకం లో అన్నిటికంటే  ప్రభువు చూపిన  ప్రేమ  గొప్పదని తెలిపారు.  రాజేష్ మాట్లాడుతూ పండుగకు  సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
పండుగ సందర్భముగా పిల్లలు, పెద్దలు అందరు ఆనందంతో, ఆటపాటలతో గడిపారు.  

Add new comment

3 + 12 =