ముగిసిన అమెజాన్ సినడ్

Amazon synodAmazon synod

ముగిసిన అమెజాన్ సినడ్ 

 

అక్టోబర్ 26 , 2019 న ఫ్రాన్సిస్ పాపు గారు అమెజాన్ సినడ్ ను ముగించారు.

సినడ్ లో జరిగిన చర్చలను దృష్టిలో ఉంచుకొని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఒక సందేశాన్ని త్వరలో తయారు చేస్తానని ఆయన చెప్పారు. అమెజాన్ లోని పరిస్థితులను కాథోలికులందరు అర్ధం చేసుకొని స్పందించాలని ఆయన అభ్యర్ధించారు

సినడ్ చివరి రోజున సభ్యులందరు ఒకొక్క అంశం పై తమ ఓట్ల ద్వారా అభిప్రాయాలను తెలియజేసారు. చర్చించిన అంశాలలో వివాహితులైన పురుషులను అభిషేకించి గురువులుగా చేసి కొరత ఉన్న ప్రదేశాలలో నియమించాలనే అంశాన్ని 181 మంది సభ్యులలో 128 మంది సభ్యులు ఆమోదించగా, 41 మంది సభ్యులు వ్యతిరేకించారు, కాగా 12 మంది తటస్థంగా ఉండి తమ నిర్ణయం చెప్పలేదు.

కాథోలిక సమాజంలో స్త్రీలు ఇంకా క్రియాశీల పాత్రను పోషించాలనే అంశాన్ని 160 మంది సభ్యులు అంగీకరించగా 11  మంది సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. స్త్రీలను దీర్ఘకాలం డీకన్లు గా నియమించాలనే అంశాన్ని 137 మంది సభ్యులు ఆమోదించగా 30 మంది సభ్యులు వ్యతిరేకించారు.

ఈ అంశంలో ఒక బృందాన్ని నియమించి ఆ బృందం అన్ని కోణాలలో దీని సాధ్యాసాధ్యాలను చూసి ఒక నిర్ణయం తీసుకొంటానని పాపు గారు చెప్పారు.

 

Add new comment

1 + 0 =