మా ఉమ్మడి ఇంటి సంరక్షణలో సహకరించడం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంప్రపంచ పర్యావరణ దినోత్సవం

తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ కోల్‌కతా (SXUK) ఆవరణలో 3 జూన్ 2022 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జరుపుకున్నారు

ఈ పూర్వ విద్యార్థుల సంఘం వారు విశ్వవిద్యాలయంలోని అధ్యాపక సభ్యులను మరియు  చుట్టుపక్కల ఆరు గ్రామాల ప్రజలను దత్తత తీసుకొని వారికి 500 పైగా మొక్కలు పంపిణీ చేసారు.

వ్యక్తిగత, కుటుంబ, సంస్థాగత మరియు సామాజిక జీవితానికి పర్యావరణం ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులలో మరియు విద్యార్థులలో అవగాహన కల్పించడానికి మేము పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాము." అని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ మరియు దాని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అయిన జేసు సభ గురువు గురుశ్రీ జాన్ ఫెలిక్స్ రాజ్ గారు రేడియో వెరితాస్ తో అన్నారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి తమ విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటి హరితహారాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి ఒక మొక్కను అందజేయడం జరిగింది.

విద్యాలయ ఆవరణను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రమాణం చేశారు.

"మా ఉమ్మడి ఇంటికి మనమందరం బాధ్యత వహిస్తాము మరియు మా వినయపూర్వకమైన సామర్థ్యంతో ఈ గొప్ప కారణానికి సహకరించే అవకాశాన్ని కలిగి ఉన్నందుకు మేము కృతజ్ఞులం" అని SXUK పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి వాసల్ చిరిమార్ అన్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి హానీ మరియు చిరిమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని భాగస్వాములందరూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు.

జెస్యూట్‌లచే రూపొందించబడిన 2019-2029కి సంబంధించిన యూనివర్సల్ అపోస్టోలిక్ ప్రాధాన్యతలలో "మా ఉమ్మడి ఇంటి సంరక్షణలో సహకరించడం" ఒకటి.

"కేరింగ్ ఫర్ అవర్ కామన్ హోమ్" అనే ముఖ్య ఉద్దిష్టంతో, కోల్‌కతాలోని కల్తేల్‌బేరియా, కుల్బేరియా, బోయెంటా, హతిషాక, జీరంగాంచ మరియు ధరమ్‌తల్లా-పంచూరియా గ్రామాలకు చెందిన విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించారు.

Add new comment

5 + 13 =