మహిళా కమిషన్ సమావేశం

మహిళా కమిషన్ సమావేశం

ఛత్తీస్గఢ్లోని లోని రాయ్పూర్ మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతులు మహా ఘన విక్టర్ హెన్రీ ఠాకూర్ మాట్లాడుతూ, "శ్రీసభ  అభివృద్ధిలో  మహిళలు పాత్ర ముఖ్యమైనదని తెలిపారు".

 నవంబర్ 23న రాయ్ పూర్ లో జరిగిన అతి మేత్రాసన  మహిళల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం  ఒక గంట ఆరాధన మరియు స్వాగత వేడుకతో ప్రారంభమైంది. 

మేత్రాసన  ఆధ్యాత్మిక గురువు  గురుశ్రీ సెబాస్టియన్ పూమట్టం మరియు సిస్టర్  దీప్తి మింజ్ లతో పాటు ఐదు డెనరీలకు చెందిన నాయకులు, మహా ఘన విక్టర్ హెన్రీ ఠాకూర్ గారు మరియు సిస్టర్  లిడ్విన్ ఫెర్నాండెజ్ యుఎఫ్ ఎస్ లు ముఖ్య అతిధులుగా   పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో  పాల్గొనేవారందరినీ 16 గ్రూపులుగా విభజించారు. మరియు ప్రతి ఒక్కరికీ  చర్చిలో వారి పాత్రకు సంబంధించి వారి అనుభవాలు మరియు ఆకాంక్షల పరంగా తమను తాము వ్యక్తీకరించుకునే అవకాశం ఈ సందర్భముగా ఇవ్వబడింది.

జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి సిస్టర్  లిడ్విన్ ఫెర్నాండెజ్ యు.ఎఫ్.ఎస్ నిర్వహించిన ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం దేవాలయం మరియు సమాజంలో, మరీ ముఖ్యంగా కుటుంబంలో ఒక క్యాథలిక్ మహిళ యొక్క ప్రాధాన్యతల పై మహిళల్లో అవగాహన కల్పించడానికి. 

 

Add new comment

10 + 0 =