మహా పూజ్య ఉడుమల బాల వరంగల్ పీఠకాపరి 9వ పీఠాధిపతుల పట్టాభిషేక వేడుకలు

మహా పూజ్య ఉడుమల బాల వరంగల్ పీఠకాపరి మే నెల 23-05-2022 సోమవారం రోజున తొమ్మిదవ పీఠాధిపతుల వార్షికోత్సవ కృతజ్ఞత దివ్యబలిపూజను సమర్పించారు. వరంగల్ పీఠం ఫాతిమమాత కథెడ్రల్ దేవాలయం నందు పీఠాధిపతులు దేవుడు తనను కాపరిగా ఎన్నిక చేసినందుకు తన ప్రజలను నడిపించే గొప్ప బాధ్యతను తనకు అప్పగించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దివ్యబలిపూజను సమర్పించారు. పీఠాధిపతులు  వరంగల్ మేత్రాసనాన్ని అభివృద్ధి పదములో ముందుకు నడిపిస్తున్నందులకు దేవుడు వారిని దీవించాలని ముప్పదొంతలుగా, అరువదొంతలుగా, నూరువంతులుగా ఫలింపజేయాలని దేవునియొక్క కృపావరాలతో ఆయన తలపెట్టే ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనమందరం కూడా ప్రార్ధన చేద్దాం. అమృతవాణి అధ్యక్షులుగా, దివ్యవాణి టీవీ ఛానల్ అధ్యక్షులుగా వారు అమూల్యమైన సేవలందిస్తున్నారు. దివ్య వాణి  టీవీ ఛానల్ ను మరియు అమృతవాణి కమ్యూనికేషన్స్ సెంటర్ ను అభివృద్ధి పాదంలో ముందుకు తీసుకువెళ్తున్న పీఠాధిపతులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తరుపున మహా పూజ్య ఉడుమల బాల పీఠాధిపతులను దేవుడు దీవించి ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని మేమందరం ప్రార్థిస్తున్నాం.   

 
 

Add new comment

1 + 0 =