మళ్లీ విజృంభిస్తున్న కరోనా

covid 19

 మళ్లీ విజృంభిస్తున్న కరోనా

దేశంలో 27 రోజుల తర్వాత  పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నిర్ధారణ అయ్యాయి.
గడచిన ఐదు రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరగడంతో మహమ్మారి రెండో దశ విజృంభణ  అని నిపుణులు అంటున్నారు.  

ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదయ్యింది. మహారాష్ట్రలో కొత్త వేరియంట్స్‌ను గుర్తించడంతో వీటి ద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నట్టు భావిస్తున్నారు.

మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నిబంధనలను కఠినతరం చేసి, వాటిని ఉల్లంఘించినవారి చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లక్షణాలు బయటపడని కరోనా బాధితులకు స్టాంపింగ్, హైరిస్క్ కాంటాక్ట్‌లను గుర్తించడం వంటి నిబంధనలు తిరిగి ప్రారంభించనున్నారు. మాస్క్ ధరించనివారికి జరిమానా వంటి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు.ముంబయి నగరంలో వరుసగా రెండు రోజులు 700కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.గతంలో కోవిడ్ కట్టడికి అనుసరించిన విధానాలనే ప్రస్తుతం అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

కేరళలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ సరిహద్దులోని 13 ఎంట్రీ పాయింట్లను మూసేసింది. కేరళ నుంచి కర్ణాటకలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. కేరళలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక అధికారులు  తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Add new comment

2 + 15 =