మరో కాశ్మీర్ గా మారుతున్న అసోం

assamassom

మరో కాశ్మీర్ గా మారుతున్న అసోం ... అసోం రక్షిత ప్రాంతంగా కేంద్ర నిర్ణయం

ఆసోంలో వీదేశీ జర్నలిస్టులు ఎవ్వరు ఉండకూడదని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆసోం ట్రీబ్యూన్ అనే పత్రిక ఓ కథనంలో పేర్కోంది. రాష్ట్రం విడిచి విదేశీ జర్నలిస్టులు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వార్తలను కవర్ చేసేందకు వచ్చే వీదేశీ జర్నలిస్టులు ముందస్తుగా కేంద్ర హోంశాఖ యొక్క అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు చేసింది.

ప్రొటెక్టెడ్ ఏరిగా అసోం

ఇటివల అస్సాంలో ఎన్ఆర్‌సీ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే, అయితే ఈ జాబితాలో సుమారు 19 లక్షల మంది పౌరుల పేర్లు చేటుచేసుకోలేదు. దీంతో అస్సాంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు జాబితాలో పేర్లు లేని వారు ట్రిబ్యునల్‌ ముందు హాజరై , భారతీయులమని నిరూపించుకోవాలి. అలా జరగనట్లయితే వారంతా దశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో జాబితాపై పలు ప్రతిపక్ష పార్టీలు కూడ విమర్శలు చేయడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అస్సాంను ప్రోటెక్టెడ్ ఏరియాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనతో రాష్ట్రేతరులు ఎవరున్నా కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది.

ఏన్ఆర్‌సీ జాబితా విదేశీ పత్రికల విమర్శలు

కేంద్రం ప్రకటించిన నేపథ్యంలోనే ఆసోంలో కొంతమంది జర్నలిస్టులు రాష్ట్రం విడిచి స్వచ్చంధంగానే వెళ్లిపోయారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఆసోసియోటెడ్ ప్రెస్ జర్నలిస్టులను స్థానిక అధికారులు దగ్గరుండి ఢిల్లీ విమానాన్ని ఎక్కించినట్టుగా తెలుస్తోంది. కాగా అస్సాంలో ఎన్‌ఆర్‌సీ పట్ల కేంద్రం అనుసరిస్తోన్న విధానాన్ని కొన్ని విదేశీ పత్రికలు టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలియజేశారు

కశ్మీర్‌, అసోంలలో ఒకేరకమైన ఆంక్షలు

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విదేశీ జర్నలిస్టులు స్థానిక వార్తలను కవర్‌ చేయాలన్నా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విదేశీ జర్నలిస్టులు అస్సాంలోకి రావాలన్నా ముందస్తుగా విదేశాంగ శాఖ లేదా హోం శాఖ అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. రాష్ట్రాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినందున విదేశీ జాతీయులు, విదేశీ పర్యాటకులు కూడా రాష్ట్రాన్ని సందర్శించాలంటే ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అనుమతి కోరవచ్చని కూడా వారు సూచించారు. ప్రస్తుతం కశ్మీర్‌లో కూడా ఇలాంటి ఆంక్షలే కొనసాగుతున్నాయి.
 

Add new comment

11 + 3 =