మరో ఐదుగురిని పునీతులుగా ప్రకటించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

CanonizationCanonization

మరో ఐదుగురిని పునీతులుగా ప్రకటించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

అక్టోబర్ 13 , 2019 న ఫ్రాన్సిస్ పాపు గారు ఐదుగురిని పునీతులుగా ప్రకటించారు.

ఒక వేదాంత శాస్త్ర నిపుణుడు, ముగ్గురు కన్యాస్త్రీలు మరియు ఒక సాధారణ దర్జీ వృత్తి చేసుకునే ఒక స్త్రీ. వీరందరూ 19 వ  మరియు 20 వ శతాబ్దానికి చెందినవారు. 

"వేరు వేరు దేశాల నుండి వేరు వేరు వృత్తులు చేసేవారైనా వీరందరిలో ఒక్క సాపత్యం ఉన్నది. అదే నిశ్చయమైన విశ్వాసం. విశ్వాసం కోసం ఒక ప్రయాణం చెయ్యాలి, దానికి ఒక మార్గం కావలి. మనం మన సౌకర్యాలను వదలి, సౌకర్య జీవితాన్ని వదలి బైటకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన జీవితాలలో విశ్వాసం చేసే అద్భుతాలను చవిచూడగలం. ఇచ్చుట వలన మరియు సవాళ్ళను స్వీకరించడం ద్వారా విశ్వాసం పెరుగుతుందని" పాపు గారు వొక్కాణించారు. 

పునీతులుగా ప్రకటించబడిన వారు ఇంగ్లాండ్ కు చెందిన కార్డినల్ హెన్రీ న్యూమన్, బ్రెజిల్ కు చెందిన సిస్టర్ డ్యుల్స్, భారత దేశానికి చెందిన సిస్టర్ మరియా తెరెసా చిరామెల్ మరియు సిస్టర్ జియూసెప్పినా  వన్నిని, చివరిగా దర్జీగా జీవనం సాగిస్తున్న మార్గరైట్ బేస్. 

ఒక వేదాంత శాస్త్ర నిపుణుడైన హెన్రీ న్యూమన్, ఆంజిలికన్ గురువు గా మొదట పని చేసి, తరువాత కాథోలిక గురువుగా మారి శ్రీసభ కు ఎంతో సేవ చేసారు. అభాగ్యులకు చేసిన సేవకు గాను సిస్టర్ డ్యుల్స్ 1988 లో నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేయబడ్డారు. పేదలకోసం తమ జీవితాలను అంకితం చేసినందుకు గాను సిస్టర్ మరియా తెరెసా చిరామెల్ మరియు సిస్టర్ జియూసెప్పినా  వన్నినిలను మరియు సామాన్య దర్జీగా జీవనం సాగిస్తూ, కాథోలిక సమాజానికి మరియు సువార్త వ్యాప్తికి మార్గరైట్ బేస్ చేసిన సేవకు గాను వీరిని పునీతులుగా పాపు గారు ప్రకటించారు. 

"నేడు మనకు క్రొత్త పునీతులను దయచేసినందుకు దేవునికి ధన్యవాదములు. వీరు, వీరి జీవితకాలం అంతా విశ్వాసంలో నడిచారు, ఇప్పుడు మనం వీరిని మధ్యవర్తులుగా ఎంచుకున్నాం" అని పాపు గారు అన్నారు.

పూజానంతరం పాపు గారు తన ప్రత్యేక వాహనంలో వెళ్తూ విశ్వాసులకు, సందర్శకులకు అభివాదం చేసారు.

జేవియర్ రోమేరో
అనువాదకర్త: అరవింద్ బండి

Add new comment

6 + 2 =