మరియగిరిమాత పుణ్యక్షేత్ర తిరునాళ్లు

మరియగిరిమాత పుణ్యక్షేత్ర తిరునాళ్లు

నల్లగొండ మేత్రాసనం , మరియమాత పుణ్యక్షేత్రం నందు  "మరియగిరిమాత పుణ్యక్షేత్ర తిరునాళ్లు" డిసెంబర్ 06 ,07 ,08 తేదీలలో జరగనున్నాయి.  ఈ మేరకు రెవ. ఫా. విజయ్ SHS, రెక్టర్ గారు మరియగిరిమాత పుణ్యక్షేత్ర తిరునాళ్లు సంబంధించి ప్రకటనను విడుదల చేసారు. 
నవంబర్ 29 నుండి డిసెంబర్ 07  తేదీ  వరకు నవదిన ప్రార్థనలు  జరగనున్నాయి. నవదిన ప్రార్థనలో  ప్రతిరోజు సాయంత్రం 5-30 గం||లకు జపమాల, నవదిన దివ్యపూజా బలులు అర్పించబడును. నవంబర్ 29 (మంగళవారం) న  మహా ఘన. గోవిందు జోజి, నల్లగొండ మేత్రాసన విశ్రాంత  పీఠాధిపతులు గారిచే పతాకావిష్కరణ మరియు  దివ్య పూజాబలి  సమర్పించబడును. 

డిసెంబర్ 08న  ఉదయం 09 .30 గంటలకు హైద్రాబాద్ అతిమేత్రాణులు & నల్గొండ మేత్రాసన అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ " మహా ఘన. కార్డినల్ పూల అంతోని" గారు మరియు మహా ఘన. గోవిందు జోజి, డిడి. నల్లగొండ మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు తో పాటు  
ఇతర గురువులచే సమిష్ట దివ్యబలిపూజ సమర్పించబడును.

తెలంగాణ రాష్ట్రములో నీలగిరి కొండపై వెలసిన ఏకైక, తొలి 'మరియతల్లి' పుణ్యక్షేత్రం నల్లగొండలోని 'మరియగిరి'. దాదాపు 800 అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన కొండగుహలో ఆ తల్లి వెలసింది. ఈ  మరియమాత పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు కుల, మత, పేద, ధనిక, ప్రాంతీయ భేదాలు లేకుండ అనేకమంది దర్శించి తరిస్తున్నారు. 

 

Add new comment

6 + 0 =