మరణ మృదంగం |carona virus |

మరణ మృదంగం

అసలు చైనా లో ఎం జరుగుతుంది  ?? 2002లో సార్స్ వ్యాధి ,తర్వాత బర్డ్ ఫ్లూ  వచ్చింది ఆ తర్వాత 2013లో ఎన్ 7, ఎన్ 9 ,2018లో జియాంగ్ షూ ప్రాంతం నుండి హచ్ 7, ఎన్ 4, మరియు 2019లో హచ్ 5, ఎన్ 6, అదే ప్రాంతం నుండి వ్యాప్తి చెందాయి .ఆ సమయం లో 8000, కి వ్యాధి సోకితే 800,మంది చనిపోయారు .ఇపుడు  వుహాన్ లో కరోనా వైరస్ .  ఇప్పటికే భారత్ సహా 25 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. భారత్‌లో మూడు కరోనా కేసులు నిర్ధారణ కాగా...వీరు ముగ్గురూ కేరళకు చెందిన వారే. ఇటీవల వీరందరూ చైనాలోని వుహాన్ నగరం నుంచి అక్కడకు వచ్చారు.
ఇప్పటి వరకు కరోనా వైరస్ కాటుకు చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 425కు చేరింది.కరోనా వైరస్‌తో ఫిలిప్పీన్స్‌లో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. చైనా దేశానికి బయట నమోదైన తొలి కరోనా వైరస్ మరణం ఇదే. ఆ దేశంలో మరో రెండు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో చైనా నుంచి తమ పౌరులుకాని వారు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఫిలిప్పీన్స్ నిషేధించింది. మంగళవారం ఉదయం వరకు ఆ దేశంలో 20,438 కేసులు నమోదయ్యాయి.

లాటిన్‌లో కరోనా అంటే ‘కిరీటం’ అని అర్థం. మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో ఉండటంతో ఆ పేరు పెట్టారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది . ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి. కానీ, ఇప్పుడు   తాజాగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చైనాలోని ఉహాన్‌లో ఓ అక్రమ జంతు విక్రయ కేంద్రం నుంచి తొలిసారిగా కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఉహాన్ నగరానికి రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. అత్యవసర వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించట్లేదు. సుమారు 11 మిలియన్ల మంది నిర్బంధంలో ఉన్నారు.

కరోనా వైరస్ హెల్ప్ లైన్ నంబర్:
కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారం అందించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి భారత ప్రభుత్వం(Ministry of Health ) హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఇది 24X7 గంటలు పనిచేస్తుంది. కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
కరోనా వైరస్ హెల్ప్‌లైన్ నంబర్: 011-23978046

 

Add new comment

1 + 7 =