మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్ధాలుమేరుగు రత్నం

మత్తు పదార్ధాలతో జీవితాలు నాశనం అవుతాయని డోన్ బోస్కో నవజీవన్ బాల భవన్ జిల్లా కో- ఆర్డినేటర్ మేరుగు రత్నం తెలిపారు. కంచికచర్ల మండలంలోని కీసర గ్రామ సచివాలయంలో గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలంటూ సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం సచివాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రత్నం గారు మాట్లాడుతూ యువత మత్తు పాదార్ధాలకు, అశ్లీల వీడియోలకు  ఆకర్షితులౌతున్నారని, వీటివల్ల వారి జీవితాలు దెబ్బతింటున్నాయని హెచ్చరించారు. యువత దేశ రక్షణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి, సర్పంచ్ పేరం నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యులు పాపట్ల సీత, వైఎస్ ఆర్ సిపి నాయకులు పరిటాల రాము, వేల్పుల రమేష్ మరియు చమల ప్రభాకర్ పాల్గొన్నారు.

Add new comment

9 + 1 =