మఠకన్యల శాశ్వత మాట పట్టు కార్యక్రమం

హైదరాబాద్ అతిమేత్రాసనం బండ్లగూడ విచారణ పునీత డాన్ బోస్కో గారి పుణ్యక్షేత్రం నందు మే 14,2022 శనివారం రోజున ఫిరంగిపురం పునీత అన్నమ్మ గారి సభ మఠకన్యలచే శాశ్వత మాట పట్టు కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పూల అంథోని గారు దివ్య పూజాబలిని సమర్పించి మరియు పరిశుద్ధ మాట పట్టు కార్యక్రమానికి అధ్యక్షతను వహించారు.  సిస్టర్ వేలంగాని ఫనీంద్ర, సిస్టర్ మేరీ జోత్స్నా,సిస్టర్ జీవం జ్యోతి, సిస్టర్ మేరీ సరసి, సిస్టర్ శోభా రాణి, సిస్టర్ జాన్సీ ట్రెసా , సిస్టర్ జేసినంత, సిస్టర్ జ్ఞాన సుజాత, సిస్టర్ బాల పావని, సిస్టర్ మార్గరెట్ ప్రియాంక, సిస్టర్ ఫ్రాన్సిస్ ప్రతిమ, సిస్టర్ ఆగ్నెస్ జ్యోతి ,ఈ పన్రెండుగురు మఠకన్యలు చివరి మాట పట్టును స్వీకరించారు.

Add new comment

2 + 0 =