భారత రాజ్యాంగ దినోత్సవం

ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును జ్ఞాపకం చేసుకోవడం మరియు రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయడం రాజ్యాంగ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ గారు  ఎంతగానో శ్రమించారు. ఆ మహనీయుని జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. 

26 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగ సభ ,  డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారధిగా కమిటీ ఏర్పాటైంది.డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కమిటీలోని ఆరుగురు సభ్యులు(6 +1) ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. 1947 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది.

మన రాజ్యాంగంలో జీవించే హక్కు, చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించే హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, మత స్వేచ్ఛ హక్కు, అల్ప సంఖ్యాకులకు రక్షణ, ఆ హక్కుల్ని పొందడానికి అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే ప్రత్యేక హక్కు కల్పించబడ్డాయి.

అందరికీ సమానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని, సంపద ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ అందేటట్లు ,చూడటం వెనుకబడిన వర్గాలకు విద్య, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు కల్పించడం వంటివి ముఖ్యమైనవి.

Add new comment

9 + 7 =