భారతదేశ నూతన నూన్సియో కు ఘన స్వాగతం

 నూన్సియోమహా ఘన లియోపోల్డో గిరెళ్ళి

భారతదేశ నూతన నూన్సియో కు ఘన స్వాగతం

భారతదేశం మరియు నేపాల్ దేశాలకు అధికారిక నూన్సియో గా నియమితులైన మహా ఘన లియోపోల్డో గిరెళ్ళి గారు ఈ రోజు ఉదయం భారత దేశం విచ్చేసారు. ఉదయం తెల్లవారు జామున ఢిల్లీ లోని ఇందిరాగాంధీ విమానాశ్రయం లో ఢిల్లీ అగ్ర పీఠాధిపతులు మరియు సిసిబిఐ సెక్రటరీ జనరల్ అయిన మహా ఘన  అనిల్ కౌతో, ఫరీదాబాద్ పీఠాధిపతి మహా ఘన  కురియాకోస్  భరణికులంగారా, మరియు  సిసిబిఐ మొదటి సెక్రటరీ గురుశ్రీ  గాబ్రియేల్  పేస్స్ తదితరులు నూన్సియో గారికి ఘన స్వాగతం పలికారు. మే 14 మరియు 15 న జరిగిన సిసిబిఐ కార్యనిర్వాహక సమావేశంలో నూన్సియో గారిని ఆహ్వానించే బాధ్యతలను ఢిల్లీ అగ్రపీఠాధిపతులు మహా ఘన  అనిల్ కౌతో గారికి అప్పగించడం జరిగింది. 

ఉత్తర ఇటలీ లోని బెర్గామో లో 13 మార్చి 1953 న లియోపోల్డో గిరెళ్ళి గారు జన్మించారు.  17 జూన్  1978 న గురువుగా అబిషిక్తులైన ఆయన అనంతరం ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. గతంలో తూర్పు తిమోర్, ఇండోనేషియా, సింగపూర్,  ఇజ్రాయెల్ మరియు సైప్రస్ దేశాలకు ఆయన నూన్సియో గా బాధ్యతలు నిర్వహించారు. 

భారతదేశానికి నూతన నూన్సియో గా నియమితులైన ఆయన రానున్న కాలంలో భారతీయ కథోలిక సంఘాన్ని దైవ మార్గం నడిపించాలని దేవుని ప్రార్ధిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి శుభాకాంక్షలు. 
 

Article by

Arvind Bandi

Online producer

Add new comment

1 + 4 =