భక్తియుతంగా పాప పరిహార పాదయాత్ర మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంత వలస గిరిజన విచారణ , క్రీస్తు రాజు పుణ్యక్షేత్రం లో పాప పశ్చాత్తాప పాదయాత్ర  భక్తియుతంగా జరిగింది.   విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు , ఎర్ర సామంత వలస విచారణ కర్తలు గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం  దేవునికి మహిమ కరముగా జరిగింది. ఉత్తరాంధ్ర లోని వివిధ విచారణ ల నుండి,  వేలాది భక్తులు ఉత్సాహంగా  పాల్గొని దేవుని ఆరాధించారు. పాదయాత్ర గా వచ్చి, కొండపై, పరిశుద్ద స్లీవ మార్గములో పాల్గొని, పూజా బలి పాల్గొని దేవుని దీవెనలు పొందారు.

గురుశ్రీ బోగి సంజీవి, గురుశ్రీ మారియాదాస్, గురుశ్రీ ఎస్ బాలశౌరి, గురుశ్రీ ఆర్గీ ప్రకాష్ , గురుశ్రీ ప్రశాంత్, గురుశ్రీ  గురుశ్రీ విమల్ రాజు ,గురుశ్రీ చినబాబు ఇతర గురువులు ఈ పాప పరిహార పాద యాత్ర మహోత్సవం లో పాల్గొన్నారు.విచారణ గాయకబృందం మధురమైన గానాలను ఆలపించారు.  

Add new comment

3 + 9 =