"బ్యాంకాక్ డాక్యుమెంట్"ను విడుదల చేసిన FABC

మార్చి 15న కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ (బొంబాయి) FABC 50 కాన్ఫరెన్స్ చివరి పత్రమైన “బ్యాంకాక్ డాక్యుమెంట్”ను విడుదల చేశారు.

ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకాక్‌లోని బాన్ ఫు వాన్ పాస్టరల్ ట్రైనింగ్ సెంటర్‌లో అక్టోబర్ 12-30, 2022 వరకు "ఆసియా ప్రజలతో కలిసి ప్రయాణం" అనే అంశంపై మొదటి సాధారణ సమావేశాన్ని నిర్వహించింది.

FABC 50 జనరల్ కాన్ఫరెన్స్ కన్వీనర్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్, సెక్రటరీ బిషప్ ఆల్విన్ డిసిల్వాతో కలిసి పత్రాన్ని విడుదల చేశారు.

కార్డినల్ గ్రేసియాస్ గారు దీనిని "ఆధ్యాత్మిక పత్రం, ఇది ప్రార్థన, వివేచన మరియు ఆధ్యాత్మిక సంభాషణ యొక్క ఫలం."

బ్యాంకాక్‌లో జరిగిన FABC 50 సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టం అని కార్డినల్ బో అన్నారు.

40 పేజీల పత్రం 5 భాగాలను కలిగి ఉంటుంది; కలిసి ప్రయాణం చేయడం, ఆసియాలో ఉద్భవిస్తున్న వాస్తవాలను చూడటం, ఆసియాలోని చర్చికి పవిత్రాత్మ ఏమి చెబుతుందో తెలుసుకోవడం, ఆసియా సంస్కృతి మరియు ఆధ్యాత్మికత మరియు కొత్త మార్గాల.

టోక్యో అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కికుచి, FABC సెక్రటరీ జనరల్ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Add new comment

5 + 10 =