బైడెన్ కొత్త చట్టాలను ఎదుర్కోవడానికి సిద్ధం కండి :ఆర్చ్ బిషప్ జోస్ గోమెజ్

us president

బైడెన్ కొత్త చట్టాలను ఎదుర్కోవడానికి సిద్ధం కండి :

యుఎస్ బిషప్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ జోస్ గోమెజ్ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ,  బైడెన్ విధానాలను పరిష్కరించడానికి ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.యుఎస్‌సిసిబి వైస్ ప్రెసిడెంట్ డెట్రాయిట్‌కు చెందిన ఆర్చ్ బిషప్ అలెన్ విగ్నెరాన్ ఈ ప్రత్యేక వర్కింగ్ గ్రూపుకు నాయకత్వం వహిస్తారు అని తెలిపారు. కొత్త చట్టాలలో  అబార్షన్ ను చట్టబద్ధం చేస్తూ బైడెన్ పాలసీలు  తీసుకొస్తున్నాడని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని  ఆర్చ్ బిషప్ జోస్ గోమెజ్ చెప్పారు. ప్రభుత్వమే అబార్షన్లకు నిధులను వెచ్చించేలా తీసుకొచ్చే పాలసీ శ్రీసభ విశ్వాసాలకు విరుద్ధమని తెలిపారు. అందరికి మంచి చేసే పాలసీలను స్వాగతిస్తామని, అయితే హత్యలను ప్రోత్సహించే అబార్షన్లను స్వాగతించబోయేది లేదని తేల్చి చెప్పారు.

 

Add new comment

1 + 2 =