బాల కార్మిక వ్యవస్థ అనేది బాలల వేధింపు అంటున్న మానవ హక్కుల కేంద్రం

బాల కార్మిక వ్యవస్థమోంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌

ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీని ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికుల పై జరుగుతున్న దుష్ట పద్ధతులపై దృష్టి సారించేందుకు బాలకార్మిక వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. చిన్నారుల చేత పనులు చేపిస్తున్నారంటే అది చిన్నారులపై దుష్టచర్యలు చేస్తున్నట్లే అని MSI ఒక సందేశంలో పేర్కొంది.

జూన్ 12న, జరిగిన ఒక కార్యక్రమంలో మోంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు ఇతర హక్కుల ఆధారిత సంస్థలు, హైదరాబాద్‌లోని కార్మిక శాఖతో కలిసి బాల కార్మిక పద్దతికి వ్యతిరేకంగా తమ మద్దతును తెలియజేసారు.

ఈ సంవత్సరం వేడుకలు బాల కార్మిక వ్యవస్థ నుండి పిల్లలను రక్షించడానికి సామాజిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 'యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్'పై దృష్టి సారించాయి.

బాల కార్మిక పద్ధతుల నిర్మూలనకు మద్దతు తెలుపుతూ గృఖాకార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ (GUTS) మరియు హైదరాబాద్ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాలల పార్లమెంట్ మాజీ ప్రధానమంత్రి మరియు సిటీ పార్లమెంట్ ప్రస్తుత మెంటర్ అయిన శ్రీ జయలక్ష్మి, బాలల హక్కులను కాపాడటం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రతి వ్యక్తి ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని వివిధ సంస్థలను ఉద్దేశించి ప్రసంగించారు.

Add new comment

9 + 10 =