బాంగ్లాదేశ్ లో ఘనంగా ముగిసిన సినడ్ - 2022 సదస్సు 

బాంగ్లాదేశ్ డయోసెసన్  ప్రీస్ట్స్బాంగ్లాదేశ్ సినడ్ - 2022

జూలై 25 నుండి 27 వరకు ఢాకాలోని హోలీ స్పిరిట్ మేజర్ సెమినరీలో బాంగ్లాదేశ్ డయోసెసన్  ప్రీస్ట్స్ ఫ్రాటెర్నిటీ (BDPF) సంఘం వారు వారి వార్షిక సాధారణ సమావేశం మరియు సినోడాలిటీపై సదస్సును నిర్వహించారు.

ఈ ఏడాది సెమినార్‌లో బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 165 మంది మేత్రాసనానికి గురువులు  పాల్గొన్నారు. సెమినార్‌లో ఢాకా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బెజోయ్ డిక్రూజ్, రాజ్‌షాహి పీఠాధిపతులు మహా పూజ్య గెర్వాస్ రోజారియో, ఖుల్నా పీఠాధిపతులు మహా పూజ్య జేమ్స్ రోమెన్ పాల్గొన్నారు.

ఈ సెమినార్ యొక్క ప్రధాన ఉద్దిష్టం "స్థానిక కథోలిక సంఘ ఏర్పాటు: దివ్యసత్ప్రదసము, పాలుపంచుకోవడం మరియు ప్రేషితకార్యము"

రోజారియో పీఠాధిపతులు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ "మనం సినోడల్ చర్చ్‌గా ఉండాలి. మరియు ఈ సినోడల్ చర్చ్‌ను ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో, ఈ సంవత్సరం సామాన్య సమావేశం యొక్క ప్రధాన ఉద్దిష్టం దివ్యసత్ప్రసాదం, పాలుపంచుకోవడం మరియు ప్రేషితకార్యం. ఈ సినోడల్ చర్చ్ ఏర్పాటులో మనం శరీరం-మనస్సు-ఆత్మలతో పాల్గొనాలి" అని అన్నారు.

"మనం ఆలకించాలి మరియు ఆలకించే వారిగా మారాలి. ఎందుకంటే దేవుడు మన విన్నపాలని ఆలకిస్తాడు. ఆయన దూతలుగా, మన సోదరులు మరియు సోదరీమణుల పలుకులను మన హృదయాలతో ఆలకించాలి. అదే సమయంలో, సత్యోపదేశకులైన మనం ప్రజల కోసం దైవరాజ్యాన్ని వేటాడే వేటగాళ్లగా మారాలి అని గెర్వాస్ పీఠాధిపతులు అన్నారు.

ఢాకా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  డిక్రూజ్ గారు మాట్లాడుతూ, "సినోడల్ చర్చి ఏర్పాటుకు కొన్ని అంశాలను ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సినడ్ ద్వారా, ప్రతి ఒక్కరి శ్రేయస్సును గూర్చి ఆలోచించాలని జగద్గురువులు మనకు చెప్పాలనుకుంటున్నారు అని అన్నారు.

"ప్రజా సంక్షేమం లేదా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలపడం క్రైస్తవ సేవకులుగా మనందరి మొదటి మరియు ప్రధాన బాధ్యత మరియు కర్తవ్యం" అని అగ్రపీఠాధిపతులు మహా పూజ్య బిజోయ్ అన్నారు.

ఈ సెమినార్‌లో ప్రధాన వక్తగా వ్యహరించిన గురుశ్రీ ప్రోశాంటో రెబెరియో మాట్లాడుతూ, "సినోడల్ చర్చి: దివ్యసత్ప్రదసము, పాలుపంచుకోవడం మరియు ప్రేషితకార్యమునకు గురువులు ప్రజల మధ్య మరియు సంఘంలోనూ ఎంత బాగా పనిచేస్తున్నారో గుర్తించాలని గుర్తుచేశారు.

"కాబట్టి, మనమందరం కలిసి ఒకే బాటలో నడవాలంటే, మనం ఫెలోషిప్ సొసైటీని నిర్మించాలి, ఏక సమాజంగా ఉండాలి మరియు ప్రేషితకార్యంలో ప్రముఖ పాత్ర వహించాలి" అని ఆయన అన్నారు.

నాలుగు రోజుల సినోడల్ సెమినార్ బహిరంగ చర్చ, మూల్యాంకనం మరియు సినడ్ 2022 యొక్క ప్రాధాన్యతల ప్రణాళికతో ముగిసింది.

Add new comment

3 + 1 =