ఫ్రాన్సిస్ పాపు గారి 50 సంవత్సరాల గురుత్వ స్వర్ణ జూబిలీ సందర్భముగా విడుదల చేసిన తపాలా బిళ్ళలు.

Stamps of Pope FrancisPostal Stamps

ఫ్రాన్సిస్ పాపు గారి 50 సంవత్సరాల గురుత్వ స్వర్ణ జూబిలీ సందర్భముగా విడుదల చేసిన తపాలా బిళ్ళలు.

 

ఏ వృత్తిలో వారికైనా స్వర్ణ జూబిలీ అనేది ఒక మైలురాయి వంటిది.  ఈ సంవత్సరం ఫ్రాన్సిస్ పాపు గారు గురువు గా తన జీవితాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు.  
బ్యూనోస్ ఐరిష్ , ఆర్జెంటినా లో డిసెంబర్  13 , 1969 న ఫ్రాన్సిస్ పాపు గారు గురువు గా అభిషేకించబడ్డారు.

"మనం ఫ్రాన్సిస్ పాపు గారి గురుత్వ జీవితపు 50 సంవత్సరాలను ఈ సంవత్సరం కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్ళలో ఒక దానిలో ఫ్రాన్సిస్ పాపు గారు యవ్వనంలో గురువుగా ఉన్నప్పటి చిత్రం కాగా రెండవదానిలో పాపుగారి ప్రస్తుత చిత్రాన్ని పెట్టడం జరిగిందని, దీని ద్వారా ఒక గురువు గా దేవుని పిలుపును పొంది, అంకిత భావంతో నేడు పునీత పేతురు గారి వారసునిగా గౌరవింపబడుతున్న ఫ్రాన్సిస్ పాపు గారి జీవితాన్ని ప్రజలకు చాటిచెప్పడం తమ ముఖ్య ఉద్దేశం" అని గురుశ్రీ మాయూరో  ఒలీవియరి చెప్పారు.

రౌల్ బేర్ జోస  అను స్పానిష్ కళాకారుడు ఈ తపాలా బిళ్లలకు రూప కల్పన చేసారు. ఫ్రాన్సిస్ పాపు గారితో దగ్గర గా ఉన్న ఆయన సహచరుల నుండి సేకరించిన వివరాలతో ఈ తపాలా బిళ్లలను తయారు చేసారు.

"మొదటి తపాలా బిళ్లలోని యువ ఫ్రాన్సిస్ గారి వెనుక సాన్ జోస్ చర్చిని చూడవచ్చు. ఈ ఆలయంలోనే ఫ్రాన్సిస్ పాపు గారు దేవుని పిలుపును అందుకొన్నారు
అలాగే ఈ చిత్రంలో  మరియ మాతను కూడా చూడవచ్చు.  "అవర్ లేడీ ది అన్ డువర్ అఫ్ నాట్స్ " గా ప్రసిద్ధి చెందిన ఈ మాతను పాపు గారు గురువుగా ఉన్నప్పటినుండి ఆదర్శంగా తీసునేవారని" గురుశ్రీ మాయూరో  ఒలీవియరి అన్నారు.

యువ ఫ్రాన్సిస్ పాపు గారి తపాలా బిళ్లకు 1.10 యూరోల ధరను నిర్ధారించగా, పాపు గారి ప్రస్తుత చిత్రం ఉన్న బిళ్ళ 1.15 యూరోలకు దొరుకుతుంది.

Add new comment

1 + 0 =